జీడి పప్పు అ‘ధర’హో!
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:41 AM
జీడి పప్పు... దీని పేరు చెప్తే... నోరు ఉవ్విళ్లూరుతుంది. దైనందిన జీవన విధానంలో జీడిపప్పు లేని వంటకాలు అంతగా రుచించట్లేదని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. అయితే ప్రస్తుత మార్కెట్లో జీడి పప్పు ధరలు ఆకాశాన్నంటడంతో నోటికి రుచించట్లేదు. ఉత్తర భారతంలోని గుజరాత, రాజస్థాన, ఢిల్లీ ఉత్తరప్రదేశ, మహారాష్ట్ర ప్రాంతాల్లో దసరా, దీపావళి పర్వదినాల్లో జీడిపప్పు వినియోగం ఎక్కువగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణంగా వ్యాపారులు చెప్తున్నారు. ఈ కారణంగానే ప్రస్తుతం మన ప్రాంతంలో జీడిపప్పు ధరలు అమాంతంగా పెరిగాయంటున్నారు.
బస్తా (80 కిలోలు) రూ.13,500

రాజానగరం, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): గత రెండు, మూడేళ్లుగా జీడి పిక్కల బస్తా (80 కిలోలు) రూ.8 వేలు నుంచి రూ.9 వేలు వరకు ఉండేది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సైతం ఇవే ధరలు పునరావృతమవుతూ వచ్చింది. గడిచిన ఆరు నెలల్లో పెట్టుబడులకు వడ్డీ, గింజల ఆరుదల కలిపితే ప్రస్తుతం బస్తా రూ.13,500 పలుకుతోంది. గింజలు నిల్వ చేసే అవకాశం లేకపోవడంతో రైతులు ఎప్పటి గింజలను అప్పుడే విక్రయించేశారు. పూర్వపు తూర్పు గోదావరి జిల్లాలో రంపచోడవరం, గోకవరం, నర్సీపట్నం ప్రాంత జీడిపప్పు నాణ్యతకు ప్రసిద్ధిగా వ్యాపారులు చెప్తున్నారు. మన ప్రాంతంలో భారీ పరిశ్రమలు స్వల్పంగా ఉండగా... కుటీర పరిశ్రమలు, దుకాణాలు విరివిగా నడుస్తున్నాయి. మన ప్రాంతం నుంచి జీడిపప్పును బెంగళూరు. మంగుళూరు, హైదరాబాదు ప్రాంతాలకు నిత్యం ఎగుమతి చేస్తుంటారు.
బస్తాకు దిగుబడి...
నాణ్యమైన జీడి పిక్కలు (80 కిలోల) బస్తాకు 20 కిలోల వరకు పప్పు దిగుబడి వస్తుంది. నాసిరకం అయితే 16 కిలోలు వస్తుంది. జీడి పిక్కల నుంచి చిన్నపాటి ముక్క, నూకతో పాటు తొక్కలు కూడా వృథా కావపోవడం విశేషంగా చెప్పొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలుగా కొనసాగుతున్న ఇవి అనేక మంది మహిళలకు జీవనోపాధి కల్పిస్తున్నాయి.
మార్కెట్లో ప్రస్తుత ధరలు...
జీడి పప్పు ప్రస్తుత మార్కెట్లో మంచి డిమాండ్ సంతరించుకుంది. గత రెండు, మూడేళ్లుగా చూస్తే జీడి పప్పు ఈ సీజన్లో కిలో రూ.550 నుంచి రూ.600 వరకు ఉండేది. ప్రస్తుతం కిలోకి సరాసరి రూ.200 వరకు పెరగడంతో కొనుగోలు చేసేందుకు వెనకాడే పరిస్థితి నెలకొని, అమ్మకాలు సైతం తగ్గాయని వ్యాపారులు వివరిస్తున్నారు. జీడి పప్పు (జంబో గుండు) రకం ప్రస్తుతం కిలో రూ.900 ఽనుంచి రూ.950 వరకు, నెం.2 రకం గుండు రూ.800 వరకు, బద్ద రూ.650 నుంచి రూ.750 వరకు వున్నాయి. గతంలో ఈ సీజన్లో కిలో రూ.550 నుంచి రూ.600 వరకు వున్న జీడి పప్పు ప్రస్తుతం కిలోకి సరాసరి రూ.200 వరకు పెరగడంతో కొనుగోలు చేసేందుకు వినియోగదారులు రాక అమ్మకాలు సైతం తగ్గాయని వ్యాపారులు వాపోతున్నారు.