Share News

స్వర్ణయుగమే

ABN , Publish Date - Mar 06 , 2024 | 01:13 AM

మాట్లాడితే నా బీసీ.. నా బీసీ... అంటూ ఇన్నాళ్లు వారిని నిలువునా మోసం చేసిన జగన్‌ సర్కారు కు టీడీపీ, జనసేన కూటమి గట్టి షాక్‌ ఇచ్చింది. ఉమ్మడి డిక్లరేషన్‌ ప్రకటనతో వైసీపీ పాలనలో నలిగిపోయిన బీసీలకు సాంత్వన చేకూర్చేలా కీలక నిర్ణయాలు ప్రకటించింది. బీసీలను ఓట్ల కోసమే వాడుకుని వారిని ఐదేళ్లుగా అణగ దొక్కిన జగన్‌ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేలా డిక్లరేషన్‌ ఆయుధాన్ని బయటకు వదిలింది. అధికారం చేతిలో ఉన్నా ఏదీ చేయకుండా బీసీలను మోసం చేసిన తీరును ఎండగట్టింది.

స్వర్ణయుగమే

  • -టీడీపీ, జనసేన ఉమ్మడి బీసీ డిక్లరేషన్‌తో జిల్లాలో బీసీలకు మళ్లీ మంచిరోజులు

  • -వైసీపీ పాలనలో నలిగిపోయి చితికిపోయిన బీసీల్లో ఆనందోత్సాహాలు

  • -తిరిగి ఆదరణ పథకం ప్రారంభిస్తామన్న డిక్లరేషన్‌ ప్రకటనతో భరోసా

  • -రూ.4వేలకు పెన్షన్‌ పెంపు, ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామనడంతో కొత్త ఉత్సాహం

  • -బీసీ భవనాలు, కమ్యునిటీ హాళ్లు ఏడాదిలో పూర్తి చేస్తామనడంతో మళ్లీ పునరుజ్జీవం

  • -1986 తర్వాత నుంచీ జరగని బీసీల కులగణనను చట్టబద్ధంగా చేస్తామని హామీ

  • -డిక్లరేషన్‌ అంశాలతో తిరిగి బీసీలకు మంచిరోజులు వచ్చినట్లేనంటూ చర్చ

  • -జిల్లాలో వైసీపీ ఐదేళ్ల పాలనలో అన్ని బీసీ పథకాలు రద్దు

  • -వచ్చీరాగానే ఆదరణ దరఖాస్తులు, పనిముట్లు కక్షతో మూలకు..

  • -ఓబీ ఎంఎంఎస్‌, ఎంబీసీ పథకాలన్నీ రద్దు చేసి బీసీలను అణగదొక్కిన జగన్‌

  • -బీసీ భవనాలు, కమ్యూనిటీ హాళ్లకు నిధులు నిలిపివేత, స్థలాలపై కన్నేసి కబ్జా

  • -అన్ని పథకాలు తీసేసి మొక్కుబడిగా జిల్లాలో 13,314మందికి మాత్రమే చేయూత

మాట్లాడితే నా బీసీ.. నా బీసీ... అంటూ ఇన్నాళ్లు వారిని నిలువునా మోసం చేసిన జగన్‌ సర్కారు కు టీడీపీ, జనసేన కూటమి గట్టి షాక్‌ ఇచ్చింది. ఉమ్మడి డిక్లరేషన్‌ ప్రకటనతో వైసీపీ పాలనలో నలిగిపోయిన బీసీలకు సాంత్వన చేకూర్చేలా కీలక నిర్ణయాలు ప్రకటించింది. బీసీలను ఓట్ల కోసమే వాడుకుని వారిని ఐదేళ్లుగా అణగ దొక్కిన జగన్‌ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేలా డిక్లరేషన్‌ ఆయుధాన్ని బయటకు వదిలింది. అధికారం చేతిలో ఉన్నా ఏదీ చేయకుండా బీసీలను మోసం చేసిన తీరును ఎండగట్టింది. తిరిగి అధికారంలోకి వచ్చాక పూర్వవైభవం తీసుకువస్తామని ఎలుగెత్తి చాటింది.

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

వైసీపీ అటకెక్కించి కక్షతో రద్దు చే సిన అనేక కీలక సంక్షేమ పథకాలను తిరిగి అమలు చేస్తామని చెప్పి జిల్లా లో బీసీల్లో టీడీపీ, జనసేన కూటమి ధైర్యం నింపింది. మళ్లీ మునుపటి స్వ ర్ణయుగాన్ని తెస్తామని చాటింది. ఆదర ణ, బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం, కుల గుణన, స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పోస్టుల్లో రిజర్వేషన్లు, బీసీ భవనాల నిర్మాణం ఇలా అనేకకీలక అంశాలపై తన అజెండా ప్రకటించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీలపై కక్షతో ఉమ్మడి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఆ దరణ పథకం దరఖాస్తులు, సిద్ధంగా ఉన్న పనిముట్లను పక్కన పారేసింది. స్వయం ఉపాధికి ఊతమిచ్చే ఓబీ ఎంఎంఎస్‌, ఎంబీసీ పథకాలన్నీ రద్దు చే సేసింది. విదేశీ విద్య, ఉపకారవేతనాల్లో కోత కోసేసింది. అన్నింటి స్థానంలో తూతూమంత్రంగా జగనన్న చేయూత పథకం ఒక్కటే అమలు చేసి ఏటా 13,314మందికి రూ.10వేల చొప్పున ఇచ్చి చేతులు దులిపేసుకుంది.

మళ్లీ ‘ఆదరణ’ అమలు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1986 లెక్కల ప్రకారం.. 15.65లక్షల మంది బీసీలున్నారు. ఆ తర్వాతనుంచి ఇప్పటివరకు బీసీలకు సంబంధించి కులగణన జరగలేదు. దీంతో అన్నింటా సంక్షేమ పథకాలు, ఇత ర రిజర్వేషన్లలో వీరంతా అన్యాయానికి గురవుతున్నారు. ఈ నేపథ్యం లో బీసీలకు వెన్నుముకగా పేరొందిన టీడీపీ తాజాగా బీసీ డిక్ల రేషన్‌ ప్రకటించడంతో జిల్లాలో బీసీలకు తిరిగి ఊపి రందినట్లయింది. ప్రస్తుత లెక్కల ప్రకారం అంచనాగా చూసినా ఉమ్మడి జిల్లాలో 19లక్షల80వేలమంది బీసీలు.. కాకినాడ జిల్లా లో 7లక్షల 40వేలమంది ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన ప్రభుత్వం రాగానే చట్టబద్ధంగా కులగణన చేప డతామని ప్రకటించడంతో ఇన్నేళ్ల సమస్యకు పరిష్కారం దొరు కుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూట మి ప్రభుత్వం అధి కారంలోకి రాగానే రూ.5వేలకోట్లతో ఆదరణ పథకం ప్రారంభి స్తామని ప్రకటించడంతో తిరిగి బీసీల్లో ధైర్యం వచ్చినట్లయింది. గత టీడీపీ ప్రభుత్వం ఆదరణ-1, ఆదరణ-2 పథకం పేరుతో జిల్లాలో బీసీల్లో ఆయా కులాలవారీగా పలు వృత్తులకు సంబంధించిన కోట్ల విలువైన లక్షలాది పనిముట్లను అందించింది. రజకుల దగ్గరనుంచి కల్లుగీత కార్మికులు, నాయి బ్రాహ్మణులు ఇలా అనేకమందికి పనిముట్లను అందించి అండగా నిలబడింది. తీరా వైసీపీ అధికారంలోకి రాగానే ఆదరణ పథకాన్ని పూర్తిగా రద్దు చేసేసింది. అప్పటికే ఉమ్మడి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న వేలాదిమంది దరఖాస్తులను పక్కన పారేసింది. వీరంతా కట్టిన డబ్బులకు సంబంధించి జిల్లాకు చేరిన వేలాది కిట్లను మూలన పడేసింది. దీంతో బీసీలంతా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

కనిపించినవన్నీ కబ్జా చేసిన వైసీపీ

గత టీడీపీ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాలో బీసీలకు ప్రతి నియోజకవర్గం లో బీసీ భవనాలు, కమ్యునిటీ హాళ్లు మంజూరయ్యాయి. వీటి నిర్మాణానికి స్థలాలు, నిధులు కూడా విడుదలయ్యాయి. దోభీ ఘాట్‌ల నిర్మాణానికి కూడా రూ.లక్షల్లో నిధులు మంజూరయ్యాయి. కానీ వైసీపీ అధికారంలోకి రాగానే వీటి నిర్మాణాన్ని ఎక్కడికక్కడ నిలిపివేసింది. స్థలాలు మంజూరైన చోట వా టిని స్థానిక వైసీపీ నేతలు కబ్జా చేసేశారు. బీసీల్లో ఆయా సామాజికవర్గాల వారీగా కార్పొరేషన్లు, నిధులు, బీసీలకు నామినేటెడ్‌ పదవుల్లో రిజర్వేషన్లు ఇస్తామని డిక్లరేషన్‌లో పొందుపరచడంతో వైసీపీ పాలనతో తాము ఎలా నలిగిపోయామో గుర్తుచేసుకుని బీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. వైసీపీ ఐదేళ్ల పాలనలో పేరుకు బీసీలకు కొన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా చిల్లిగవ్వ కూడా నిధులు కేటాయించలేదు. దీం తో అవన్నీ అలంకారప్రాయంగా మారాయి. ఇప్పుడు డిక్లరేషన్‌ ద్వారా రిజర్వే షన్‌ అమలు చేస్తామని టీడీపీ చెప్పడంతో ఎందరో బీసీలకు పదవులు లభించనున్నాయి. బీసీల్లో ఉన్న అనేక ఉప కులాల్లో తక్కువ జనాభా ఉన్నవారికి, ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు కోఆప్షన్‌ సభ్యులుగా అవకాశం ఇస్తామని చెప్పడంతో వారందరికీ తొలిసారిగా గుర్తింపు లభించే అవకాశం ఏర్పడింది. టీడీపీ పాలనలో జిల్లాలో బీసీలకు ముఫ్పైకి పైగా పథకాలు అమల్లో ఉండేవి. కానీ బీసీలను కేవలం ఓటర్లుగానే చూసిన వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇవన్నీ రద్దు చేసేసింది. జగనన్న చేయూత పథకం ఒక్కటే మహిళలకు అందుబాటులోకి తెచ్చింది. ఇందులోను రకరకాల కోతలు కోసి కాకినాడ జిల్లాలో ఏడాదికి 13,314మందికి, ఉమ్మడి తూ.గో. జిల్లాలో 36,177మందికి మాత్రమే ఏడాదికి రూ.పది వేలు ఇచ్చి మమ అనిపిస్తోంది.

ప్రత్యేక రక్షణ చట్టంపై హర్షం

డిక్లరేషన్‌లో పేర్కొన్న విధంగా బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంతో బీసీల్లో ఆనందం ఉప్పొంగుతోంది. వైసీపీ ఐదేళ్ల పాలనలో జిల్లాలో అనేక రకాల దాడులు జరిగాయి. కల్లుగీత కార్మికుల దగ్గరనుంచి నాయీబ్రాహ్మణులు, రజకులపై అధికారులు, వైసీపీ నేతలు జరిపిన దాడులకు లెక్కలేదు. ఈ నేపథ్యంలో ప్రత్యేక రక్షణ చట్టంతో బీసీలకు ఊరట లభించినట్లయింది. వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు తిరిగి అమలు చేస్తామని తాజాగా టీడీపీ, జనసేన డిక్లరేషన్‌లో పేర్కొనడంతో బీసీల్లో ఆనందం వ్యక్తమవుతోంది. తిరిగి తమకు పూర్వవైభవం వస్తుందనే ధీమాను వారంతా వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గత టీడీపీ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో బీసీలకోసం బీసీ కార్పొరేషన్‌ ద్వారా ఓబీ ఎంఎంఎస్‌ పథకాన్ని అమలు చేసింది. ఏదైనా వ్యాపారం చేసుకోవాలనుకుని ముందుకు వచ్చిన లబ్ధిదారులకు రూ.లక్ష సబ్సిడీ, మరో రూ.లక్ష లోన్‌ అందించి ఆర్థికంగా ఎదగడానికి తోడ్పడింది. ఎంబీసీ పథకం ద్వారా రూ.30వేలు అందించి వ్యాపారులు ప్రోత్సహించింది. జగన్‌ ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ రద్దు చేసి పారేసింది. దీంతో ఆర్థికంగా నిలదొక్కుకుని స్వయం ఉపాధిపై నిలబడాలనుకున్న బీసీలంతా రోడ్డున పడ్డారు. బీసీ భవనాలు, కమ్యూనిటీ హాళ్లను ఏడాదిలోగా నిర్మిస్తామన్న డిక్లరేషన్‌ ప్రకటనతో బీసీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 06 , 2024 | 01:13 AM