టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చేలా కృషి
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:13 AM
సర్పవరం జంక్షన్, మార్చి 5: రాబోయే ఎన్ని కల్లో టీడీపీ-జనసేన ఉమ్మడి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చేలా సమష్టిగా కృషి చేయాలని భీమిలి టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ పంచకర్ల సందీప్ కోరారు. మంగళవారం నేమాం, వలసపాకల గంగరాజునగర్ జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నేమాం మాజీ సర్పంచ్ ఇంజరపు సుబ్బారాయుడు 15 మంది అనుచరులు, ఇంద్రపాలెం నుంచి బొల్లే భవాని శంకర్ ఆధ్వర్యంలో సుమారు 60 మం దితో జనసేనలో చేరా

భీమిలి ఇన్‌చార్జి పంచకర్ల సందీప్
సర్పవరం జంక్షన్, మార్చి 5: రాబోయే ఎన్ని కల్లో టీడీపీ-జనసేన ఉమ్మడి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చేలా సమష్టిగా కృషి చేయాలని భీమిలి టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ పంచకర్ల సందీప్ కోరారు. మంగళవారం నేమాం, వలసపాకల గంగరాజునగర్ జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నేమాం మాజీ సర్పంచ్ ఇంజరపు సుబ్బారాయుడు 15 మంది అనుచరులు, ఇంద్రపాలెం నుంచి బొల్లే భవాని శంకర్ ఆధ్వర్యంలో సుమారు 60 మం దితో జనసేనలో చేరారు. వారికి జనసేన-టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ, సందీప్ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, అభివృద్ధి కోసం ఇరుపార్టీల అధినేతల పవన్, చంద్రబాబు చారిత్రకంగా పొత్తు పెట్టుకున్నారన్నారు. రాక్షస పాలన అంతం కోసం అధినేతల ఆదేశాల మేరకు రాబోయే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా సమష్టిగా ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. టీడీపీ, జనసేన మండలాధ్యక్షులు రాందేవు సీతయ్యదొర, కరెడ్ల గోవిందు, దాసరి శివ, పోసిన రాము, పుల్ల శ్రీరాములు, చైర్మన్ శ్రీను తదితరులు ఉన్నారు.