Share News

కాకినాడ సెజ్‌ బాధితులకు అండగా ఉంటాం : నాగబాబు

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:28 AM

పిఠాపురం, ఏప్రిల్‌ 18: కాకినాడ సెజ్‌ బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు తెలిపారు. పిఠాపురం మండలం కుమారపురంలోని గోకులం గ్రాండ్‌ లో గురువారం జనసేన నియోజకవర్గ కమిటీ సభ్యుడు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, కాట్నం విశాలి, మండల కమిటీ సభ్యులు మలక సూర్యచంద్ర, వడ్డు రాజేష్‌, బండి సునీల్‌ల ఆధ్వర్యంలో కొత్తపల్లి మండలం కొత్తమూలపేట గ్రామపంచాయతీకి చెందిన 72మంది కేఎస్‌ఈజెడ్‌

కాకినాడ సెజ్‌ బాధితులకు అండగా ఉంటాం : నాగబాబు

పిఠాపురం, ఏప్రిల్‌ 18: కాకినాడ సెజ్‌ బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు తెలిపారు. పిఠాపురం మండలం కుమారపురంలోని గోకులం గ్రాండ్‌ లో గురువారం జనసేన నియోజకవర్గ కమిటీ సభ్యుడు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, కాట్నం విశాలి, మండల కమిటీ సభ్యులు మలక సూర్యచంద్ర, వడ్డు రాజేష్‌, బండి సునీల్‌ల ఆధ్వర్యంలో కొత్తపల్లి మండలం కొత్తమూలపేట గ్రామపంచాయతీకి చెందిన 72మంది కేఎస్‌ఈజెడ్‌ బాధితులు జనసేనలో చేరారు. వారికి నాగబాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాధితుల సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని చెప్పారు. వైసీపీ నాయకుల బెదరింపులతో రాష్ట్రంలో కొత్తగా నెలకొల్పుదామనుకున్న కంపెనీలు కూడా పారిపోయాయని తెలిపారు. నిజాయితీపరుడైన పవన్‌కల్యాణ్‌ ఎమ్మెల్యేగా ఏ విషయంలోనైనా ప్రజల పక్షానే నిలబడతారని తెలిపారు. వైసీపీ నాయకులు మాదిరిగా తప్పుడు కేసులు పెట్టే సంస్కృతి తమది కాదని, అటువంటిది తమకు నచ్చదని తెలిపారు. అలాగే పిఠాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు గురువారం సాయంత్రం జనసేన పార్టీలో చేరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్‌(బాబీ), నాయకులు మేడిశెట్టి నాగమణి, నాగమణి, జ్యోతి, నల్లల రామకృష్ణ, దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:28 AM