నేడు జనసేన నాగబాబు రాక
ABN , Publish Date - Jun 22 , 2024 | 12:07 AM
పిఠాపురం, జూన్ 21: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు శనివారం పిఠాపురం నియోజకవర్గానికి రానున్నారు. మధ్యాహ్నం 3.30గంటల నుంచి గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ నివాసంలో నాగబాబు అందుబాటులో ఉంటారని జనసేన నియోజకవర్గ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీ
పిఠాపురం, జూన్ 21: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు శనివారం పిఠాపురం నియోజకవర్గానికి రానున్నారు. మధ్యాహ్నం 3.30గంటల నుంచి గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ నివాసంలో నాగబాబు అందుబాటులో ఉంటారని జనసేన నియోజకవర్గ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. జనసేన నాయకులు, కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. కాగా ఉదయం నుంచి వివిధ వర్గాల ప్రజలు, అధికారులతో నాగబాబు సమావేశమవుతారని జనసేన వర్గాలు తెలిపాయి.