Share News

అన్ని విధాలా కాకినాడను అభివృద్ధి చేస్తా

ABN , Publish Date - May 12 , 2024 | 12:11 AM

కార్పొరేషన్‌ (కాకినాడ), మే 11: అన్ని విధాలుగా కాకినాడను అభివృద్ధి చేస్తానని కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గ జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌ హామినిచ్చారు. కాకినాడలో శనివారం జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ నిర్వహించిన సభలో ఉదయ్‌శ్రీనివాస్‌ మా ట్లాడుతూ నేను ప్రజల్లో తిరిగే ఒక మధ్యతరగతి యువకుడిని. మీ ఇంట్లో ఉండే ఒక అన్నయ్యని, ఒక తమ్ముడిని ఒక బిడ్డని. చంద్రబాబు, పవన్‌ నాయక

అన్ని విధాలా కాకినాడను అభివృద్ధి చేస్తా
కాకినాడ సభలో మాట్లాడుతున్న ఎంపీ అభ్యర్థి ఉదయ్‌శ్రీనివాస్‌

ఏడీబీ రహదారిని త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తా

కాకినాడ పార్లమెంట్‌ జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌

కార్పొరేషన్‌ (కాకినాడ), మే 11: అన్ని విధాలుగా కాకినాడను అభివృద్ధి చేస్తానని కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గ జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌ హామినిచ్చారు. కాకినాడలో శనివారం జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ నిర్వహించిన సభలో ఉదయ్‌శ్రీనివాస్‌ మా ట్లాడుతూ నేను ప్రజల్లో తిరిగే ఒక మధ్యతరగతి యువకుడిని. మీ ఇంట్లో ఉండే ఒక అన్నయ్యని, ఒక తమ్ముడిని ఒక బిడ్డని. చంద్రబాబు, పవన్‌ నాయకత్వంలో కాకినాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నానన్నారు. రాజకీయాలకు రాకముందే టీటైం ఉదయ్‌గా 25వేల మందికి ఉపాధి కల్పించిన చిన్న వ్యాపార వేత్తనన్నారు. అలాగే 1100 మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దిన యువకుడిని అన్నారు. మరో 600మందితో ప్రైవేట్‌ ఎంప్లాయిమెంట్‌ వింగ్‌ ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లో ఖాళీగా ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగల అవకాశాలపై అవగాహన కలిస్తూ ఎంప్లాయిమెంట్‌ ఇస్తూ ముందుకు వెళ్తున్నాను. కాకినాడ పోర్టును అభివృద్ధి చేసి మోడల్‌ చేసి అక్కడ యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు. కాకినాడ పోర్టు నుంచి ఎయిర్పోర్ట్‌కి వెళ్లే ఏడీబీ రహదారిని త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తానన్నారు. కాకినాడ బీచ్‌ని పర్యాటక రంగంలో ప్రథమ స్థానంలో ఉండేలా తీర్చిదిద్దుతానన్నారు. కాకినాడ ఎస్‌సిజడ్‌లో పరిశ్రమలను తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. పవన్‌, మోదీ సహకారంతో కాకినాడను అన్నివిధాల అభివృద్ధి చేస్తానన్నారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ప్రజలు కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

వైసీపీని ఓడించాలి

కూటమికే దళితుల మద్దతు పోస్టర్లనుఆవిష్కరించిన ఉదయ్‌శ్రీనివాస్‌

కార్పొరేషన్‌ (కాకినాడ), మే 11: దళితులను మోసం చేసిన వైసీపీని ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ధి చెప్పాలని దళిత వర్గాల ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు చెట్టే రాజు అన్నారు. శనివారం కాకినాడ నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో కూటమి అభ్యర్థులకే దళితుల మద్దతు పోస్టర్‌ను కూటమి ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భగా చెట్టే రాజు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ జరగాలంటే బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి రావాలని... కూటమి గెలుపునకు దళితులు అండగా నిలవాలని కోరారు. దళిత నాయకులు గాలింకి పవన్‌, నందికోళ్ల సురేష్‌, కొల్లి చైతన్య, రేపు విజయ్‌, కోడి సుజ్ఙాన్‌ పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2024 | 12:11 AM