Share News

‘కూటమి ప్రభుత్వంతో పూర్వవైభవం’

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:24 AM

కాకినాడ సిటీ, ఏప్రిల్‌ 16: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన రోజునుంచి భవన నిర్మాణ రంగానికి పూర్వవైభవం సంతరించుకోనుందని కాకినాడ పార్లమెంట్‌ జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ అన్నారు. కాకినాడలోని ఓ హోటల్‌లో కనస్ట్రక్షన్స్‌ అండ్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వ

‘కూటమి ప్రభుత్వంతో పూర్వవైభవం’

కాకినాడ సిటీ, ఏప్రిల్‌ 16: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన రోజునుంచి భవన నిర్మాణ రంగానికి పూర్వవైభవం సంతరించుకోనుందని కాకినాడ పార్లమెంట్‌ జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ అన్నారు. కాకినాడలోని ఓ హోటల్‌లో కనస్ట్రక్షన్స్‌ అండ్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, కాకినాడ రూర ల్‌ అసెంబ్లీ జనసేన అభ్యర్థి పంతం నానాజీ, కాకినాడ రూరల్‌ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి హాజరయ్యా రు. ఉదయ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ రంగానికి, దానిపై ఆధారపడిన 20రకాల వృత్తుల వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించ నుందన్నారు. సమావేశంలో కనస్ట్రక్షన్స్‌, బిల్డర్స్‌ అసోసియేషన్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 12:24 AM