Share News

జగ్గంపేట జనసేన ఇన్‌చార్జి పాఠంశెట్టి నిరసన

ABN , Publish Date - Feb 25 , 2024 | 02:00 AM

24: టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాలో జగ్గంపేట నియో జకవర్గం ఎమ్మెల్యే సీటును టీడీపీ జ్యోతుల నెహ్రూకు కేటాయించడంతో జగ్గంపేట జనసేన ఇన్‌చార్జి పాఠంశెట్టి సూర్యచంద్ర మనస్తాపానికి గురయ్యారు.

జగ్గంపేట జనసేన ఇన్‌చార్జి పాఠంశెట్టి నిరసన

గోకవరం/ జగ్గంపేట, ఫిబ్రవరి 24: టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాలో జగ్గంపేట నియో జకవర్గం ఎమ్మెల్యే సీటును టీడీపీ జ్యోతుల నెహ్రూకు కేటాయించడంతో జగ్గంపేట జనసేన ఇన్‌చార్జి పాఠంశెట్టి సూర్యచంద్ర మనస్తాపానికి గురయ్యారు. తాను సామాన్యుడిగా పుట్టినం దుకే సీటు నిరాకరణకు గుర య్యానని అన్నారు. తన చావుతో ఎమ్మెల్యే సీటు ఆశించే సామాన్య అభ్యర్థులకు కనువిప్పు కలగాలన్నారు. ఆయన తీసుకున్న నిర్ణయంలో భాగంగా జగ్గంపేట మండలం గూనాడ నుంచి కార్యకర్తలతో పాదయాత్ర చేసుకుంటూ గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో బలవన్మరణానికి పాల్పడతానంటూ తన భార్యతో కలిసి బయలుదేరారు. నా భార్య ఇష్టదేవత దుర్గమ్మ గ్రామంలో ఉండడంతో అక్కడ తనువు చాలిస్తానన్నారు. సూర్య చంద్ర తీసుకున్న నిర్ణయం చట్టవ్యతిరేకమంటూ పోలీసులు ఆయన పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆయన పాదయాత్ర కొనసాగిస్తూ గోకవరం మండలం పెంటపల్లి వరకూ చేరుకున్నారు. అక్కడ ఆయన పాదయాత్ర అడ్డుకునేందుకు పోలీసులుచుట్టుముట్టారు. దీంతో ఆయన పక్కదారి గుండా అచ్యుతాపురం చేరేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో పోలీసులు.. ఆయనకు మధ్య జరిగిన పెనుగు లాటలో సూర్యచంద్ర స్పృహతప్పి పడిపోయారు. కార్యకర్తలు సపరిచర్యలు చేసిన కొద్దిసేపటికే మేల్కొని మాట్లాడారు. పవన్‌ కల్యాణ్‌ తన దేవుడంటూ కొనియాడారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని శిరసా వహిస్తానన్నారు. కానీ 2019నుంచి తాను ప్రజల్లో తిరుగుతూ జనసేన పార్టీని ఎంతో బలోపేతం చేశాన న్నారు. కానీ సీటు నిరాకరణకు గురవడంతో తన ఆశయం నీరుగారిపోయిందన్నారు. అందుకే నా అంతిమ ఆమరణ దీక్షకు పూనుకోవడం జరిగిందన్నారు. పాదయాత్ర నేపథ్యంలో సుమారు 100 పోలీసులు పాదయాత్ర వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Updated Date - Feb 25 , 2024 | 09:56 AM