Share News

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ

ABN , Publish Date - Jan 21 , 2024 | 12:33 AM

గండేపల్లి, జనవరి 20: వైసీపీ అరాచక పాలన భరించలేక ఆ పార్టీని వీడి టీడీపీలోకి స్వచ్ఛంధంగా చేరుతున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతులనెహ్రూ

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ
వైసీపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు

వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు

గండేపల్లి, జనవరి 20: వైసీపీ అరాచక పాలన భరించలేక ఆ పార్టీని వీడి టీడీపీలోకి స్వచ్ఛంధంగా చేరుతున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతులనెహ్రూ అన్నారు. శనివారం మండలంలో నీలాద్రిపేట గ్రామానికి చెందిన సుమారు 30 కుటుంబాలకు పైగా వైసీపీ నుంచి టీడీపీలోకి నెహ్రూ ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీ పీ పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, కార్యకర్తలను కూడా భయపట్టే విధంగా రాజకీయాలు చేశారన్నారు. ఇప్పుడు ఆ భయాన్ని వీడి స్వచ్ఛంధంగా టీడీపీలోకి చేరుతున్నారన్నారు. రోజురోజుకు నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అవుతుందన్నారు. మారిశెట్టి భద్రం, కురికురి చౌదరి, అడబాల భాస్కరరావు, బొల్లంరెడ్డి రామకృష్ణ, యర్రంశెట్టి, కొల్లు త్రి మూర్తులు, బొండా శ్రీనుబాబు తదితరులు ఉన్నారు.

జయహో బీసీ సభ

జెడ్‌.రాగంపేట గ్రామ శివారులో ఉన్న పరిణయ ఫంక్షన్‌ హాల్లో టీడీపీ మండలాధ్యక్షులు పోతుల మోహన్‌రావు ఆధ్వర్యంలో నియోజకవర్గ బీసీ సెల్‌ అధ్యక్షుడు శీలామంతుల వీరబాబు అధ్యక్షతన నిర్వహించిన జయహో బీసీ సభకు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా నెహ్రూ హాజరయ్యారు. కార్యక్రమం లో రాష్ట్ర పెరిక సాధికారిక సమితి కన్వీనర్‌ వనపర్తి బద్రి , తుమ్మల రమేష్‌, ఒమ్మి బాలాజీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోర్పు లచ్చయ్యదొర, ఎస్వీఎస్‌ అప్పలరాజు, తంగిరెళ్ళ అప్పారావు, అడబాల భాస్కరరావు, బొల్లంరెడ్డి రామకృష్ణ, సుంకవిల్లి సత్యనారాయణ, కొల్లు త్రి మూర్తులు, సుంకవిల్లిరాజు, కొత్తకొండబాబు, బొండా శ్రీనుబాబు, రొంగల శ్రీను, శ్రీదేవి తదితరులున్నారు.

గుర్రపాలెంలో...

జగ్గంపేట, జనవరి 20: జగ్గంపేట మండలం గుర్రంపాలెంలో పడాల విష్ణు, పొలం పద్మరాజు, చీపురపల్లి త్రిమూర్తులు, తాతపూడి సత్తిబా బు, గోనిపాటి రాజు, ముమ్మల ఆనంద్‌, కురందాస్‌ లోవ, మువ్వల గంగాధర్‌ ఆధ్వర్యంలో వైసీపీ నుంచి టీడీపీలోకి 100 కుటుంబాలు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీలో చేరగా పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ,జనసేన సంకీర్ణ ప్రభుత్వానికి అందరూ సహకరించి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో ఎస్వీఎస్‌ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, చదరం చంటిబాబు, అడబాల వెంకటేశ్వరరావు, కొత్త కొండబాబు, పైడిపాలసూరిబాబు, రేఖ బుల్లిరాజు, దాపర్తి సీతారామయ్య, సుంకవిల్లిరాజు, పడాల ధర్మరాజు, పడాల ఈశ్వరరావు, పడాల రాంబాబు తదితరులున్నారు.

Updated Date - Jan 21 , 2024 | 12:33 AM