Share News

క్రీడలతో మానసిక, శారీరక ఆరోగ్యం

ABN , Publish Date - Jan 17 , 2024 | 11:18 PM

గండేపల్లి, జనవరి 17: క్రీడలు మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో తోడ్పడతాయని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. మండలంలోని ఎన్టీరాజపురం గ్రామంలో సంక్రాం తి సంబరాల్లో భాగంగా 3రోజులుగా జడ్పీటీపీ పరిమి వెంకటలక్ష్మి మంగతాయారు పరిమి బా బు ఆధ్వర్యంలో పరిమి వీర్రాజు అన్నపూర్ణ మె మోరియల్‌ జిల్లాస్థాయి వాలీబాల్‌ టోర్నమెంట్‌ జరిగింది. జిల్లా నలుమూలల నుంచి 30కి పైగా జట్టులు పాల్గొన్నాయి. మంగళవారం రాత్రి పోటీ ల్లో కానవరం,

క్రీడలతో మానసిక, శారీరక ఆరోగ్యం
పోటీల్లో విజేతలతో జ్యోతుల నెహ్రూ

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ

గండేపల్లి, జనవరి 17: క్రీడలు మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో తోడ్పడతాయని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. మండలంలోని ఎన్టీరాజపురం గ్రామంలో సంక్రాం తి సంబరాల్లో భాగంగా 3రోజులుగా జడ్పీటీపీ పరిమి వెంకటలక్ష్మి మంగతాయారు పరిమి బా బు ఆధ్వర్యంలో పరిమి వీర్రాజు అన్నపూర్ణ మె మోరియల్‌ జిల్లాస్థాయి వాలీబాల్‌ టోర్నమెంట్‌ జరిగింది. జిల్లా నలుమూలల నుంచి 30కి పైగా జట్టులు పాల్గొన్నాయి. మంగళవారం రాత్రి పోటీ ల్లో కానవరం, నరేంద్రపురం జట్లు తలపడగా కానవరం మొదటిస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో నరేంద్రపురం, మూడోస్థానంలో ఎన్టీరాజపురం, నాల్గోస్థానంలో సోమవరం జట్లు నిలిచాయి. ముఖ్య అతిథిగా నెహ్రూ హాజరై విజేతలకు ట్రోఫీ, రూ.25వేలు నగదు, రెండో బహుమతి రూ.15వేలు, మూడో బహుమతి రూ.10వేలు, నాల్గో బహుమతి రూ.5వేలు క్రీడాకారులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, నిరుత్సాహ పడకుండా ఇప్పుడు ఓడినవారు గెలుపు కోసం కృషి చేయాలన్నారు. టీడీపీ జిల్లా ఉపాఽధ్యక్షుడు కోర్పు సాయితేజ్‌, కందుల చిట్టిబాబు, జాస్తి వసంత్‌, మారిశెట్టి భద్రం, సుంకవిల్లి రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 11:18 PM