Share News

పవన్‌ను కలిసిన జ్యోతుల నెహ్రూ

ABN , Publish Date - May 12 , 2024 | 12:14 AM

జగ్గంపేట, మే 11: కాకినాడలో శనివారం జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ బహిరంగ సభ నిర్వహించారు. సభ అనంతరం జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ పవన్‌ని కలిసి జగ్గంపేట నియోజకవర్గంలో ఎన్నికల పరిస్థితిని వివరించారు. పవన్‌కల్యాణ్‌ నెహ్రూతో మాట్లాడుతూ

పవన్‌ను కలిసిన జ్యోతుల నెహ్రూ

జగ్గంపేట, మే 11: కాకినాడలో శనివారం జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ బహిరంగ సభ నిర్వహించారు. సభ అనంతరం జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ పవన్‌ని కలిసి జగ్గంపేట నియోజకవర్గంలో ఎన్నికల పరిస్థితిని వివరించారు. పవన్‌కల్యాణ్‌ నెహ్రూతో మాట్లాడుతూ జగ్గంపేట నుంచి మంచి మెజార్టీతో గెలిచి రావాలని, ఎంపీ అభ్యర్థి ఉదయ్‌శ్రీనివాస్‌కు మంచి మెజార్టీ తీసుకురావాలని కూటమి అధికారం రావడానికి మీ నుంచి నాంది పలకాలని అన్నారు. నియోజకవర్గంలో జనసైనికులు, వీర మహిళలు, ఎంతోకష్టపడి పని చేసి టీడీపీ నాయకుల సమన్వయంతో ఎన్నికల్లో మంచి మెజార్టీ సాధించి కూటమి జెండాలు ఎగురవేస్తామని, ఎంపీ అభర్థి కూడా మంచి మెజార్టీవస్తుందని నెహ్రూ పేర్కొన్నారు.

Updated Date - May 12 , 2024 | 12:14 AM