జగ్గన్నతోట ప్రభల ఉత్సవ ఏర్పాట్లపై కలెక్టర్‌కు నివేదిక
ABN , Publish Date - Dec 31 , 2024 | 01:27 AM
సంక్రాంతి సందర్భంగా కనుమ రోజున అంబాజీ పేట మండలం మొసలపల్లి పరిధిలోని జగ్గన్నతోటలో నిర్వహించే ఏకాదశ రుద్రుల ఉత్సవంలో ఏర్పాట్లు, సమస్యలపై ఉత్సవ కమిటీ సూచనల మేరకు కలెక్టర్‌కు నివేదిక అందిస్తామని దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనరు వి.సత్యనారాయణ తెలిపారు.

అంబాజీపేట, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి సందర్భంగా కనుమ రోజున అంబాజీ పేట మండలం మొసలపల్లి పరిధిలోని జగ్గన్నతోటలో నిర్వహించే ఏకాదశ రుద్రుల ఉత్సవంలో ఏర్పాట్లు, సమస్యలపై ఉత్సవ కమిటీ సూచనల మేరకు కలెక్టర్‌కు నివేదిక అందిస్తామని దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనరు వి.సత్యనారాయణ తెలిపారు. కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశాలతో జగ్గన్నతోటలో తీర్థం జరిగే ప్రదేశాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకాదశ రుద్రుల ప్రభల ఉత్సవంలో 11గ్రామాల నుంచి ప్రభలను ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రభలు జగ్గన్నతోటలో ఒకేచోట కొలువుతీరి భక్తులకు దర్శనం అందిస్తారన్నారు. ఈఉత్సవానికి దేశ, విదేశాల నుంచి సుమారు లక్షకు పైగా భక్తులు తీర్థానికి తరలివచ్చి స్వామివార్లను దర్శించుకుంటారని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారన్నారు. ఈతీర్థానికి సంబంధించి పలు సమస్యలను ఉత్సవ కమిటీ సభ్యులు దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌కు వివరించారు. ప్రభలను తీర్థానికి తీసుకువచ్చే రహదారుల్లో శానిటేషన్, తుప్పలు తొలగించాలని, తీర్థంలో బూరలు నిషేధించాలన్నారు. తీర్థానికి వచ్చే భక్తులకు తాగునీరు అందించాలని, ప్రభలు వచ్చే రహదారులల్లో ట్రాఫిక్ ఇబ్బం దులు లేకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు వ జగ్గన్నతోట తీర్థానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. ఉత్సవ కమిటీ సభ్యులు సూచించిన సమస్యలు, కావాల్సిన సదుపాయాలపై జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందిస్తానని ఆయన తెలిపారు. దేవదాయ శాఖాధి కారి బి.వెంకటేశ్వరరావు, స్ధానికులు పాల్గొన్నారు.