జగనన్న కాలనీల్లో ఇళ్ల పైనుంచి విద్యుత్ తీగలు
ABN , Publish Date - Jan 12 , 2024 | 11:29 PM
జగనన్న కాలనీలో గ్రామాల్లోనూ విద్యుత్ సమస్య లు ఎక్కువగా ఉన్నాయని ఎంపీటీసీలు, సర్పంచ్‌లు విద్యుత్ శాఖ అధికారులు, ఎంపీపీ దృష్టికి తీసుకొచ్చారు. దేవరపల్లిలో శుక్రవారం సాయంత్ర మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఎంపీపీ కేవీకే దుర్గారావు అధ్య క్షతన జరిగింది.

సమస్యలు పరిష్కరించాలంటూ ఎంపీటీసీలు, సర్పంచ్‌ల వేడుకోలు
దేవరపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం
దేవరపల్లి, జనవరి 12: జగనన్న కాలనీలో గ్రామాల్లోనూ విద్యుత్ సమస్య లు ఎక్కువగా ఉన్నాయని ఎంపీటీసీలు, సర్పంచ్‌లు విద్యుత్ శాఖ అధికారులు, ఎంపీపీ దృష్టికి తీసుకొచ్చారు. దేవరపల్లిలో శుక్రవారం సాయంత్ర మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఎంపీపీ కేవీకే దుర్గారావు అధ్య క్షతన జరిగింది. దేవరపల్లి, త్యాజంపూడి, చిన్నాయిగూడెం, సంగాయిగూడెం గ్రామాల్లో జగనన్న కాలనీల్లో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని త్యాజంపూ డి ఎంపీటీసీ పల్లి రాంబాబు, యాదవోలు సర్పంచ్ వరప్రసాద్ సభ దృష్టికి తీసుకొచ్చారు. త్యాజంపూడిలోని జగనన్న కాలనీల్లో బేస్మెంట్, స్లాబ్ లేవెల్ నిర్మాణాలు చేపట్టారని, అయితే విద్యుత్‌తీగలు కాలనీ మధ్యలో నుంచి వెళ్ల డంతో నిర్మాణాలు ఆగిపోయాయని వాపోయారు. దీంతో వెంటనే విద్యుత్‌లైన్లు మార్చాలని దేవరపల్లి విద్యుత్‌శాఖ ఏఈ కృష్ణారావును, యర్నగూడెం విద్యుత్ శాఖ ఏఈ సురేష్‌ను ఎంపీపీ ఆదేశించారు. వ్యవసాయ శాఖ ఏవో కె.విజయ్ మాట్లాడుతూ ధాన్యాన్ని రూ.20 కోట్లతో కొనుగోలు చేశామని, 60శాతం ప్రభు త్వం కొనుగోలు చేసిందన్నారు. కొనుగోలు చేసిన సొమ్మును రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. ఆర్‌బీకే కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలు విక్రయిస్తు న్నామని చెప్పారు. ఎంపీపీ కేవీకే దుర్గారావు పాఠశాలల్లో మిడ్డే మీల్స్‌లో నాణ్యమైన ఆహారం అందించే విధంగా విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పాము, కుక్కకాటులకు అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచామని అన్నారు. త్వరలో ఎన్నికలు ఉన్నాయని ఎన్నికల కోడ్ రాక ముందే గ్రామాల్లో, పంచాయతీ పరిధిలోని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాలని అధికారులను, ప్రజాప్రతినిధు లను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణంరాజు, తహశీల్దార్ రామకృష్ణ, వైస్ ఎంపీపీ అరుణ, సుబ్బారావు, పలు శాఖల అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.