Share News

జగన్‌కే వైసీపీలో సభ్యత్వం లేదు

ABN , Publish Date - Jul 26 , 2024 | 01:08 AM

వైసీపీలో మాజీ సీఎం జగన్‌ కే సభ్యత్వం లేదని ఆ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రాజమహేంద్రవరం పేపరుమిల్లు ఎదురుగా ఉన్న కృష్ణసాయి కల్యాణ మండపంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

జగన్‌కే వైసీపీలో సభ్యత్వం లేదు

  • టీకే విశ్వేశ్వరరెడ్డి

రాజమహేంద్రవరం సిటీ, జూలై 25: వైసీపీలో మాజీ సీఎం జగన్‌ కే సభ్యత్వం లేదని ఆ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రాజమహేంద్రవరం పేపరుమిల్లు ఎదురుగా ఉన్న కృష్ణసాయి కల్యాణ మండపంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్‌ఆర్‌ మరణించాక తండ్రి ఆశయాల ప్రకారం పనిచేస్తాడని తాను ఆనాడు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలోకి చేరానని చెప్పారు. కానీ జగన్‌ కేవలం సీఎం పదవికోసమే చూశాడని పార్టీలో ప్రజావ్యతిరేక విధానాలనే అవలంభించాడన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక కనీసం సభ్యత నమోదు ప్రక్రియ నిర్వహించలేదన్నారు. ఆ పార్టీలో కార్యకర్తలను కనీసం మనుషులుగా కూడా చూడరన్నారు. అది తట్టుకోలేకే తాను ఈనెల 23న విజయవాడలో షర్మిలరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరానని చెప్పారు. వైఎస్‌ షర్మిళారెడ్డి న్యాయకత్వంలో పార్టీని మరింతగా బలోపేతం చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు బోడా వెంకట్‌, మార్టిన్‌ లూధర్‌, బాలేపల్లి మురళీధర్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు కిషోర్‌ జైన్‌, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు మోతా శారద, సీతానగరం, కోరు కొండ మండల అధ్యక్షులు నల్లా వీర్రాజు, దోసపాటి సత్యప్రసాద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నలగడ్డ సాయి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 01:08 AM