Share News

జగన్‌ నిర్వాకంతో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:47 AM

గత ఐదేళ్లూ జగన్‌ నిర్వాకం వల్ల రాష్ట్రం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో పడిందని, రూ.10 లక్షల కోట్లు పైబడి ఆర్థిక లోటు ఉందని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అ న్నారు. రాజమహేంద్రవరం తిలక్‌రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు.

జగన్‌ నిర్వాకంతో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం
నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే వాసు

  • మాజీ సీఎం చేసినవన్నీ ఆర్థిక విధ్వంసాలే

  • ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌

రాజమహేంద్రవరం సిటీ, జూలై 27: గత ఐదేళ్లూ జగన్‌ నిర్వాకం వల్ల రాష్ట్రం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో పడిందని, రూ.10 లక్షల కోట్లు పైబడి ఆర్థిక లోటు ఉందని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అ న్నారు. రాజమహేంద్రవరం తిలక్‌రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. విభాగాల వారీగా పరిశీలిస్తుంటే జగన్‌ రెడ్డి చేసిన అప్పులు, ఆర్థిక విధ్వంసాలు బయటకు వస్తున్నాయన్నారు. 2014-19 మధ్య చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు ఆర్థిక మిగులుతో తెలంగాణతో పోటీపడిన ఆంధ్రప్రదేశ్‌ జగన్‌ సీఎం అయ్యాక 2019-24 మధ్య ఆర్థిక విధ్వంసాలు, అప్పులు ఊబిలో కూరుకుపోయి కుదేలైందన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబు చాలా కష్టపడుతున్నారని చెప్పారు. ప్రతిపక్షహోదా కోసం హైకోర్టుకు వెళ్లిన జగన్‌ ఒకటి గుర్తుపెట్టుకోవాలని అతనికి ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో 36 మంది హత్యకు గురయ్యారని దొంగ సాకు పెట్టు ఢిల్లీ వెళ్లి అక్కడ రాష్ట్రం పరువు తీశాడన్నారు. జిల్లాలో జరిగిన అవభూముల స్కామ్‌పై విచారణ కోరామని చెప్పారు. అవినీతికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు బొమ్ములు దత్తు, యెనుముల రంగబాబు తదితరులు పాల్గొన్నారు.

  • పునరావాస కేంద్రంలో సదుపాయాలపై ఆరా

స్థానిక చందాసత్రంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఉన్న బ్రిడ్జిలంక ప్రజలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి పరామర్శించారు. పునరావాస కేంద్రంలో అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వరద బాధితులుగా ఉన్న ప్రతి కుటుంబానికి రూ.3 వేలు నగదు, 25 కిలోల బియ్యం, లీటర్‌ ఆయిల్‌ ప్యాకెట్‌, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళ దుం పలు, కిలో కందిపప్పు ఇచ్చినట్టు ఆయన చెప్పారు. కార్యక్రమంలో సత్రం మాజీ చైర్మన్‌ యిన్నమూరి దీపు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌కుమార్‌, రెడ్డి మణి, శెట్టి జగదీష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2024 | 12:47 AM