Share News

‘జగన్‌ ప్రభుత్వాన్ని గద్దెదింపడమే ప్రజల అజెండా’

ABN , Publish Date - Jan 28 , 2024 | 11:43 PM

ఆరాచక పాలన సాగిస్తున్న జగన్‌ ప్రభుత్వాన్ని గద్దెదించడమే ప్రజలు అజెండాగా భావిస్తున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బం డారు సత్యానందరావు అన్నారు.

‘జగన్‌ ప్రభుత్వాన్ని గద్దెదింపడమే ప్రజల అజెండా’

రావులపాలెం, జనవరి 28: ఆరాచక పాలన సాగిస్తున్న జగన్‌ ప్రభుత్వాన్ని గద్దెదించడమే ప్రజలు అజెండాగా భావిస్తున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బం డారు సత్యానందరావు అన్నారు. వెదిరేశ్వరంలో జరిగిన స మావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్‌ పాలన ముగింపునకు సమయం ఆసన్నమైందన్నారు. 74 రోజుల్లో ఆ పార్టీ కనుమరుగవ్వడం ఖాయమన్నారు. వైసీపీ సాగిస్తున్న అరా చకాలు, దురాగతాలకు తీర్పు ఇవ్వడానికి ప్రజాకోర్టు సిద్ధం గా ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు సయ్యపు రాజు రామకృష్ణంరాజు, సరిపెల్ల వెంకట శ్రీనివాసరాజు, సయ్యపురాజు నరసింహరాజు, సాధనాల శ్రీను పాల్గొన్నారు.

టీడీపీకి పెరుగుతున్న ఆదరణ

రావులపాలేనికి చెందిన మాజీ ఎంపీటీసీ కొండేపూడి రామకృష్ణ వైసీపీకి రాజీనామా చేసి రెండు రోజుల క్రితం టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆదివారం ఆయన అనుచ రులు పలువురు టీడీపీలో చేరారు. వారికి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు చిలువూరి సతీష్‌రాజు, యువ నాయకుడు బండారు సంజీవ్‌, కోనాల అంబేడ్కర్‌, మాసాబత్తుల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రజామోదం కలిగిన నాయకుడికే రాజోలు సీటు

మాజీమంత్రి గొల్లపల్లి

మలికిపురం, జనవరి 28: ప్రజా ఆమోదం కలిగిన నాయకుడికే రాజోలు అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం-జనసేన ఉమ్మడి అభ్యర్థిని ప్రకటిస్తారని మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. కొల్లాబత్తుల కుమార్‌ ఇంటి వద్ద మలికిపురంలో అడబాల యుగంధర్‌ అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు, పరిశీలకుడు చిటికెల రామ్మోహనరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీమంత్రి గొల్లపల్లి మాట్లాడుతూ 43 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన చంద్రబాబు నిస్వార్థపరుడు, నిబద్ధత, నిజాయితీ కలిగి ప్రజాసేవే పరమావధిగా భావించే పవన్‌కల్యాణ్‌ల కలయికతో రాష్ట్రంలో మరో మూడున్నర నెలల్లో అద్భుతమైన పరిపాలన రాబోతుందని అన్నారు. కార్యక్రమంలో గొల్లపల్లి తనయుడు గొల్లపల్లి శ్రీధర్‌, ఎంపీపీ కేతా శ్రీను, మంగెన భూదేవి, చెల్లింగి సత్యనారాయణ, కాండ్రేగుల సత్యనారాయణ, అడబాల యుగంధర్‌, ముప్పర్తి నాని, రాపాక నవరత్నం, చాగంటి స్వామి, బందెల పద్మ పాల్గొన్నారు.

ఎన్నికలకు సంసిద్ధంగా ఉండండి

పార్టీ శ్రేణులకు రెడ్డి సుబ్రహ్మణ్యం దిశా నిర్దేశం

రామచంద్రపురం, జనవరి 28: ఎన్నికలు ఎంతో దూరం లేవని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల యుద్ధం ఎ ప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి ప్రతి కార్యకర్త, ప్రతి నాయ కుడు సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రామ చంద్రపు రం పట్టణం క్లస్టర్‌-1 ఇంటిగ్రేటెడ్‌ శిక్షణా సమా వేశం శీలం వారి సావరంలో క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌ మేడిశెట్టి సూర్యనారాయణ ఇంటివద్ద, కమ్మవారి సావరంలో క్లస్టర్‌-2 ఇన్‌చార్జ్‌ అక్కల రిష్వంత్‌రాయ్‌ నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌.ఎస్‌. మాట్లాడుతూ ఇంతవరకూ భవిష్యత్‌కు గ్యారంటీ కార్యక్రమం ఎక్కడెక్కడ జరిగిందీ, జనాభా ప్రాతిపదికన ఇంకా ఎక్కడెక్కడ జరగాలన్న వివరాలు సేకరించారు. అలాగే తుది ఓటరు జాబితా విడుదలైన నేపథ్యంలో అప్ర మత్తంగా వుండాలని అన్నారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు కడియాల రాఘవన్‌, మేడిశెట్టి శేషారావు, గుణ్ణం వినోద్‌, అక్కల ఠాగూర్‌, జాస్తి విజయలక్ష్మి,వెలుగుబంట్ల లక్ష్మణ్‌, రాజేశ్వరి, బళ్ల లక్ష్మి, కొసనా శ్రీనివాసరావు, ఖండ విల్లి విజయవీరబాబు, తదితరులు పాల్గొన్నారు.

రామచంద్రపురంలో టీడీపీ గెలవాలి

ద్రాక్షారామ: రామచంద్రపురం నియోజకవర్గంలో రాను న్న ఎన్నికల్లో టీడీపీ గెలిచి తీరాలని నియోజకవర్గ ఇన్‌చార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. అందుకుగాను వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నియోజకవర్గ రెడ్డి సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. ఆదివరం రామచంద్రపురం మండలం వేగాయమ్మపేట, అంబికపల్లి అగ్రహారం గ్రామాల్లో జరిగిన క్లస్టర్‌, 3,4 సమావేశాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. క్లస్టర్‌ ఇన్‌చార్జులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

టీడీపీలో పలువురు చేరిక

మండపేట, జనవరి 28: మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సమక్షంలో పలువురు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. మండలంలోని చినద్వారపూడికి చెందిన గ్రామ వలంటిర్‌తోసహ, పలువురు గ్రామానికి చెందిన టీడీపీ నేత చింతపల్లిరామకృష్ణ సారఽఽథ్యంలో ఆదివారం టీడీపీలో చేరా రు. వారిలో గ్రామవలంటిర్‌ చింతపల్లి గణేష్‌, పిఎంసీ మాజీచైర్మన్‌ నీలదుర్గారావు, సూరంపూడి మణికంఠ తది తరులు ఉన్నారు. అలాగే రాయవరం మండలం సోమేశ్వరం గ్రామానికి చెందిన గుత్తుల శ్రీనివాసరావు, నేతృత్వంలో అన సూరి గణేశ్వరరావు, మేడిశెట్టివెంకట్రావు, బేపన వెంకన్న, పందిరి వీరబాబు,తాడి నాగరాజు తదితరులు పార్టీలో చేరా రు. చేరినవారికి పార్టీకండువాలను కప్పి వేగుళ్ల పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్‌ టీడీపీ ఉపాధ్యక్షుడు వై.ఆర్‌.కే పరమహంస, రావుల సత్యన్నారాయణ, శాఖశ్రీనివాసరావు, గుత్తుల శ్రీను, కర్రివెంటకటరెడ్డి, కాళ్లమణిప్రసాద్‌, నల్లివెంకటరమణ, పిల్లి వెంకటరమణ, కురుపూడి ఉమ,మార్కెట్‌ కమిటి మాజీ చైర్మన్‌ సూరంపూడిగనిరాజు, గుడాల వీరవెంకటరమణ, చిం తపల్లి కృష్ణ, పలివెల పనసయ్య తదితరులు పాల్గొన్నారు.

ద్వారపూడిలో బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారంటీ

మండలంలోని ద్వారపూడి పంచాయతీ పరిధిలోగల చిన ద్వారపూడిలో ఆదివారం బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారం టీ కార్యక్రమంను నిర్వహించారు. ఎమ్మెల్యే వేగుళ్ల కార్యక్ర మంలో మాట్లాడుతూ వైసీపీ పాలనలో బీసీ సబ్‌ప్లాన్‌ ని ధులు పక్కదారి పట్టించారన్నారు. వేగుళ్ల గ్రామంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట టీడీపీ శ్రేణులు, నల్లమిల్లి వీర్రెడ్డి, యరగతపు బాబ్జి, ఎంఎసీ మజీ చైర్మన్‌ సూరంపూడి గనిరాజు, గోవిందు, చింత పల్లికృష్ణ, కోడే రాఘవేంద్రరావు, కోట గంగాదర్‌ పాల్గొన్నారు.

టీడీపీ బలోపేతానికి కృషి: నెక్కంటి

కపిలేశ్వరపురం, జనవరి 28 : టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశానని విజయనగరం జోనల్‌ ఆర్టీసీ మాజీ చైర్మన్‌, మాజీ ఎంపీపీ నెక్కంటి బాలకృష్ణ అన్నారు. మండలంలోని వెదురుమూడిలో ఆదివా రం తన అనుచరులతో కలిసి నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను టీడీపీ నాయకుడిగా ఎన్టీరామారావు పార్టీ స్ధాపించినప్పటి నుంచి నేటివరకూ ఆపార్టీ చేసిన సేవలను గురించి వివరించారు. పార్టీ అధి ష్టానం నిర్ణయమే శిరోధారంగా పార్టీ విజయానికి కృషి చేస్తానని బాలకృష్ణ తెలిపారు. సమావేశంలో పి.శేషగిరిరావు, సుంకరకృష్ణ, జి.వెంకటరమణ, ఎస్‌వీ పట్టాభిరామారావు, పి.వెంకట్రావు, జి. సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 11:43 PM