ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:38 AM
స్థానిక నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ చింతపల్లి కృష్ణసుధాకర్ తెలిపారు.

యానాం, జూన్ 16: స్థానిక నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ చింతపల్లి కృష్ణసుధాకర్ తెలిపారు. సెంటాక్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసువాలన్నారు. ఐటీఐలో చేరే ప్రతి విద్యార్థికి నెలకు రూ.వెయ్యి శిక్షణ భుృతి, ప్రతి తరగతి టాఫర్‌కు నెలకు రూ.వెయ్యి ప్రోత్సాహకంగా, ఏటా రెండు జతల దుస్తులు, ఒక వర్కింగ్ కోచ్, గుర్తింపుకార్డు, ఉచిత మధ్యాహ్న భోజనం అందజేస్తామన్నారు. బాలికలకు కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఏడాది కోర్సు, ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీ, బాలురకు పిట్టర్, ఎలకా్ట్రనిక్, మెకానిక్, ఎలక్ట్రీషియన్ రెండేళ్ల కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. జూన్ 30లోగా దరఖాస్తులు చేయాలని, వివరాలకు ఐటీఐ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.