Share News

ఇండియా కూటమితోనే రాజ్యాంగ పరిరక్షణ, ప్రత్యేక హోదా సాధ్యం

ABN , Publish Date - Apr 16 , 2024 | 02:11 AM

ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురావడం ద్వారానే భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్న వాళ్లమవుతామని కూటమి నేతలు సీపీఐ రాష్ట్రకార్యదర్శి కే రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, కాంగ్రెస్‌ పార్టీ రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజులు స్పష్టంచేశారు.

ఇండియా కూటమితోనే రాజ్యాంగ పరిరక్షణ, ప్రత్యేక హోదా సాధ్యం
సమావేశంలో అభివాదం చేస్తున్న సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు

ఆత్మీయ సమావేశంలో కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ నేతలు

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 15: ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురావడం ద్వారానే భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్న వాళ్లమవుతామని కూటమి నేతలు సీపీఐ రాష్ట్రకార్యదర్శి కే రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, కాంగ్రెస్‌ పార్టీ రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజులు స్పష్టంచేశారు. రాజమహేంద్రవరం ఆనం రోటరీహాలులో సోమవారం సీపీఎం జిల్లా కార్యదర్శి టీ అరుణ్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి టి మధు అధ్యక్షతన జరిగిన కూటమి ఆత్మీయ సమావేశంలో వారు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురా లు అక్కినేని వనజ, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జంగా గౌతమ్‌, కాంగ్రెస్‌ పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి బోడా వెంకట్‌, రూరల్‌ అభ్యర్థి బాలేపల్లి మురళీధర్‌, కొవ్వూరు అభ్యర్థిని అరిగెల అరుణకుమారి, గోపాలపురం అభ్యర్థి మార్టిన్‌ లూఽథర్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభు త్వ రంగ సంస్థలను అదాని, అంబానీలకు కట్టబెడుతుందన్నారు. రైతుల రుణమాఫీకి ఆర్థిక వ్యవస్థ బాగోలేదని చెప్పి కార్పొరేట్‌ కంపెనీలకు మాత్రం వేల కోట్లు రుణాలను మాఫీ చేస్తోందన్నారు. బీజేపీని వ్యతిరేకించే సీఎంలను సైతం జైళ్లలో నిర్బంధిస్తుందన్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పిన జగన్‌ మాట తప్పాడన్నారు. ఏపీకి న్యాయం జరగాలంటే ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలని.. అది ఇండియా కూటమి వల్లనే సాధ్యమవుతుందన్నారు. దేశాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు ఇండియా కూటమి అభ్యర్థు లకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం వారంతా ఐక్యత చాటారు. అనంతరం సీపీ ఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు రాజమహేంద్రవరం అభ్యర్ధి బోడా వెంకట్‌ ప్రచార రథాలకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత డీవీవీఎస్‌ వర్మ, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కుండ్రపు రాంబాబు, సీపీఎం నగర కార్యదర్శి బి.రాజులోవ, బి.పవన్‌, సీపీఐ నగర కార్యదర్శి వి.కొండలరావు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు తులసి, జువ్వల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 07:43 AM