Share News

అక్రమ నిర్బంధాలతో పోరాటాలను అడ్డుకోలేరు

ABN , Publish Date - Feb 06 , 2024 | 11:55 PM

అక్రమ నిర్బంధాలతో పోరాటాలను అడ్డుకోలేరని సర్పంచ్‌ల సంఘం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు పాలడుగుల లక్ష్మణరావు అన్నారు. మంగళవారం సర్పంచ్‌ల సమస్యల పరిష్కారం కోరుతూ చలో అసెంబ్లీ ముట్టడికి వచ్చిన సర్పంచ్‌ల సంఘం నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్టుచేసి గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలోని గుంటూరు రూరల్‌ మండలం నల్లపాడు పోలీస్టేషన్‌కు తరలించి నిర్బంధించారు.

అక్రమ నిర్బంధాలతో పోరాటాలను అడ్డుకోలేరు
నల్లపాడు పోలీస్టేషన్‌లో లక్ష్మణరావును నిర్బంధించిన దృశ్యం

  • సర్పంచ్‌ల సంఘం ఉమ్మడి పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణరావు

కొవ్వూరు, ఫిబ్రవరి 6: అక్రమ నిర్బంధాలతో పోరాటాలను అడ్డుకోలేరని సర్పంచ్‌ల సంఘం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు పాలడుగుల లక్ష్మణరావు అన్నారు. మంగళవారం సర్పంచ్‌ల సమస్యల పరిష్కారం కోరుతూ చలో అసెంబ్లీ ముట్టడికి వచ్చిన సర్పంచ్‌ల సంఘం నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్టుచేసి గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలోని గుంటూరు రూరల్‌ మండలం నల్లపాడు పోలీస్టేషన్‌కు తరలించి నిర్బంధించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ సర్పంచ్‌ల 16 డిమాండ్లను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని 12918 పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 14, 15 ఆర్ధిక సంఘం నిధులు రూ.8,629 కోట్లు దారి మళ్లించిందన్నారు. దారి మళ్లించిన నిధులను సర్పంచ్‌ల ఖాతాల్లో జమచేయాలని, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, సర్పంచ్‌ల ఆధీనంలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హమీ నిధులు చట్ట ప్రకారం పంచాయతీలకు ఇచ్చి సర్పంచ్‌ల ఆధ్వర్యంలో ఖర్చు చేయించాలన్నారు. పంచాయతీలకు ఉచిత విద్యుత్‌ అందించాలని, సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు రూ.15,000, ఎంపీపీ, జడ్పీటీసీలకు రూ.30,000 గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అక్రమంగా నిర్బంధించిన సర్పంచ్‌లను విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో తుంపల్లి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2024 | 11:55 PM