Share News

మండల సమావేశంలో సభ్యుల భర్తల హంగామా

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:55 AM

మండల సమావేశంలో సభ్యుల భర్తల హంగామా

మండల సమావేశంలో సభ్యుల భర్తల హంగామా

మండపేట, ఫిబ్రవరి 12: మండపేట మండల సమావే శంలో సభ్యులుకానివారు హాజరై సమస్యలపై అధికారు లను ప్రశ్నించారు. మండలపరిషత్‌ సమావేశం ఎంపీడీవో ఆర్‌.శ్రీ దేవి అధ్యక్షతన సోమవారంజరిగింది. సమావేశానికి ఎంపీపీ, ఎంపీటీసీలు, అధికారులు హాజరయ్యారు. సమావేశానికి జడ్పీటీసీ భర్త ఆమెకు బదులుగా సమావేశ మందిరంలో ఎంపీపీ, అధికారులు చెంత కూర్చున్నారు. మరో ఎంపీటీసీ భర్త, మరో సర్పంచ్‌ భర్త కూడా సమావేశానికి హాజర య్యారు. ఇలాసభ్యులు కానీ వారు మండల సమావేశానికి హాజరవుతున్నా అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. సమావేశంలో ఎంపీపీ వాసు మాట్లాడుతూ ప్రతిపక్ష టీడీపీ గతంలో చేసిన అభివృద్ధి పనులను గ్రామాల్లో ఫ్లెక్సిల రూపంలో పెడుతూ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తహసీల్దార్‌ సురేష్‌బాబు మాట్లాడుతూ ఎన్నికలు సక్రమంగా జరిగేలా ప్రజలు ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.వెలగతోడు, మాంటిక్లేర్‌ కాల్వ పూడిక పెరిగిపోయి సాగునీరు అందటం లేదని సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. మెర్నిపాడుకు జేగురుపాడు నుంచి వచ్చే పంట బోదె పూడుకు పోవడంతో సాగునీరు అందటం లేదని సర్పంచ్‌ భర్త అధికారులు దృష్టికి సమావేశంలో తీసు కువచ్చారు. వివిధశాఖల అధికారులు ఆయా శాఖల ఆధ్వ ర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. సమావేశా నికి పలు శాఖల అధికారులు డుమ్మాకొట్టారు. సమావేశంలో వైస్‌ ఎంపీపీలు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు ఈవోపీఆర్డీ రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 12:55 AM