Share News

వైభవంగా హనుమజ్జయంతి

ABN , Publish Date - Jun 02 , 2024 | 01:38 AM

హనుమాన్‌జ్జయంతిని మండలంలోని పలు హనుమాన్‌ మందిరాల్లో శనివారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

 వైభవంగా హనుమజ్జయంతి

ముమ్మిడివరం, జూన్‌ 1: హనుమాన్‌జ్జయంతిని మండలంలోని పలు హనుమాన్‌ మందిరాల్లో శనివారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఆంజనేయస్వామిని వివిధ రకాల పుష్పాలు, పండ్లతో విశేష అలంకారం చేశారు. ముమ్మిడివరంలోని అభయాంజనేయస్వామివారి ఆలయంలో అర్చకులు సుదర్శనం రామచిరంజీవాచార్యుల ఆధ్వర్యంలో విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, పంచామృత మండపారాధన, కుంభపూజ, అభిషేకం, తమలపాకుల పూజ, సింధూరార్చన, శాంతిహోమం తదితర పూజలను ఘనంగా నిర్వహించారు. సాయంత్రం రామరక్షా స్తోత్రం, హనుమాన్‌ చాలీసా పారాయణం నిర్వహించారు. ముమ్మిడివరం విష్ణాలయం సెంటర్‌, పెద్దవంతెన సెంటర్‌, రాయుడువారిపాలెం, పళ్లవారిపాలెం, క్రాపచింతలపూడి, కొమానపల్లి, అనాతవరం, గేదెల్లంక, గాడిలంక తదితర గ్రామాల్లో హనుమాన్‌జ్జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆలయాల వద్ద అన్నసమారాధనలు నిర్వహించారు.

Updated Date - Jun 02 , 2024 | 08:22 AM