Share News

సెంటు..మంట!

ABN , Publish Date - Jul 08 , 2024 | 12:14 AM

పేదోడిని గూడు గోడు వేధిస్తోంది. సొంతింటి కల ‘కల’గానే మిగిలిపోతోంది. పేదోడికి సెంటు జాగా కరు వైంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లూ రేపు ఇస్తాం.. మాపు ఇస్తాం గడిపేశారు. చివరికి కోరుకొండ మండలం బూరుగుపూడి ఆవ భూముల్లో స్థలాలు కేటాయించి చేతులు దులుపుకున్నారు..

సెంటు..మంట!
మా స్థలం చూపండి సార్‌ : రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు పట్టాలిచ్చి స్థలాలు చూపాలని అడుగుతున్న లబ్ధిదారులు

జగనన్న కాలనీల పేరిట భారీ అవినీతి

పనికిరాని భూముల్లోనే లేఅవుట్లు

స్థలాలు ఇచ్చినా లబ్ధిదారుల విముఖత

జిల్లా వ్యాప్తంగా ఇదే తీరు

రాజమహేంద్రిలో ఆవ భూములు

20 వేల పట్టాలిచ్చినట్టు రికార్డులు

50 వేల దరఖాస్తులు పెండింగ్‌

స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌

కూటమి నేతలకు ప్రజల వేడుకోలు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

పేదోడిని గూడు గోడు వేధిస్తోంది. సొంతింటి కల ‘కల’గానే మిగిలిపోతోంది. పేదోడికి సెంటు జాగా కరు వైంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లూ రేపు ఇస్తాం.. మాపు ఇస్తాం గడిపేశారు. చివరికి కోరుకొండ మండలం బూరుగుపూడి ఆవ భూముల్లో స్థలాలు కేటాయించి చేతులు దులుపుకున్నారు.. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఎన్నికల ముంగిట హడావుడి చేశారు. పట్టా లు పంపిణీ చేసి ప్రజలను మోసం చేశారు. ఓటు రాజకీయం చేసి ప్రజల మనోభావాలతో ఆటలాడుకు న్నారు. వేలాదిగా వచ్చిన దరఖాస్తులను గృహ నిర్మాణ కార్యాలయంలో మగ్గబెట్టారు. చివరికి కేంద్ర ప్రభుత్వం కేటాయించినా వాటిలో నాలుగో వంతు పూర్తి చేయలేక పోయారు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం కొలువుదీరడంతో సొంతింటి కల సాకారమవుతుందనే ఆశతో జనం ఎదురు చూస్తున్నారు. తాము పెట్టుకున్న దరఖాస్తులకు గ్రహణం వీడుతుందనే ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

టిడ్కో గృహాలివ్వండి సారూ..

2019కి ముందు టీడీపీ హయాంలో పెద్ద ఎత్తున టిడ్కో గృహాలు నిర్మించారు. సుమారు 80 శాతం నిర్మా ణం పూర్తయిన తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయినా టిడ్కో గృహాలు మాత్రం కేటాయించలేదు.. ఐదే ళ్లు ఊరించి ఉసూరుమనిపించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు వడ్డీ కట్టలేకపోతున్నామంటూ ఆవే దన వ్యక్తం చేశారు.అయినా గత వైసీపీ పాలకులకు ఏం పట్టలేదు.టీడీపీపై ఉన్న రాజకీయ కక్షతో పేదలను ఇబ్బ ందులకు గురి చేశారు.బ్యాంకులోన్లు కట్టలేక.. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయి పేదలు ఎంతో ఇబ్బంది ప డ్డారు.ఆ ఐదేళ్లూ ఇంటి అద్దె కట్టలేక సతమతమయ్యారు. ఐదేళ్లూ తాము పడ్డ కష్టానికి వైసీపీ నాయకులను బాధ్యు లను చేయాలని లబ్ధిదారులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్ప టికైనా టిడ్కో గృహాలు ఇవ్వాలని కోరుతున్నారు.

పేదల స్థలాల పేరిట మేత..

వైసీపీ ప్రభుత్వంలో పేదల స్థలాల పేరిట బాగా అవి నీతికి పాల్పడ్డారు. పేదల పేరిట పనికిరాని ముంపు భూములను పది రెట్ల ఎక్కువ రేటుకు కొనుగోలు చేసి భారీగా సొమ్ములను జేబులో వేసుకున్నారు. పైగా వాటిని చదును చేస్తున్నామంటూ మట్టిలోనూ మెక్కేశారు. చివ రికి చినుకు పడితే ఆ స్థలాలు వరద గోదావరిని తల పించేవి. రాజమహేంద్రవరం నియోజకవర్గంలో అయితే మరీ దారుణం. ఏకంగా కోరుకొండ మండలం బూ రుగుపూడిలో ఆవ భూమిని కొనుగోలు చేసి సెంటు చొప్పున పట్టాలు పంపిణీ చేశారు. అయితే ఆ భూమిని ఇంటి నిర్మాణానికి ఆమోదయోగ్యంగా ఉండదు. చినుకు పడిందంటే చెరువైపోతోంది.మామూలుగా ఆ ఆవ భూమి రెండు తాడిచెట్ల లోతు నీటితో నిండి ఉంటుందని స్థాని కుల సమాచారం. దీనిపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. జిల్లాలో జగనన్న కాలనీలు ఆరంభించని నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరమే. సెంటు జాగా కోసం వైసీపీ నేతలు జనాలను వేధించు కుతిన్నారు. వైసీపీ హయాంలో ప్రజలు గూడుకు ఇచ్చిన దరఖాస్తులు వేలాదిగా గృహనిర్మాణ శాఖ కార్యాలయంలో పేరుకుపోయాయి.అదిగో స్థలం.. ఇదిగో ఇల్లు అంటూ దరఖాస్తులను మగ్గబెట్టారు.కూటమి ప్రభుత్వంలో వాటికి మోక్షం కలుగుతుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

పనికిరాని భూములే స్థలాలుగా..

జిల్లాలోని వైసీపీ నేతలు ప్రజలు కళ్ల ముందే కనికట్టు చేశారు. ఎందుకూ పనికిరాని భూములను కొనుగోలు చేసి స్థలాల కింద కేటాయించారు. జిల్లాలోని తాళ్లపూడి మండలం సూరాయిపేట, బల్లిపాడులో స్థలాలు కేటా యించడంతో పెద్ద వివాదమే నడిచింది. ఆయా స్థలాల లబ్ధిదారులు ఏకంగా గత కలెక్టర్‌ మాధవీలతను నిల దీశారు. నివాసయోగ్యం కాని భూములు మాకొద్దంటూ నిరసన తెలిపారు. బల్లిపాడు లబ్ధిదారులకు తిరుగుడు మెట్టలో స్థలాలు కేటాయించినా అక్కడా అదే పరిస్థితి. ఏ ఒక్కరూ ఇళ్లు నిర్మించుకోలేదు.దేవరపల్లి మండలం కృష్ణపాలెం,ధుమంతునిగూడెం గ్రామస్తులకు కృష్ణపాలెం పరిధిలో ఉన్న పోలవరం కాల్వ గట్టు పక్కన సుమారు 275 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఈ స్థలాలు వర్షాకాలంలో ముంపునకు గురవుతాయి.దీంతో ఆ స్థలాలు మాకొద్దంటూ లబ్ధిదారులు జాతీయ రహదా రిపైనే బైఠా యించి నిరసన తెలిపారు. గత కలెక్టర్‌ మాధవీలత వచ్చి పరిశీలించి ఎటూ తేల్చకుండా వదిలే శారు. యర్నగూ డెంలో ఊరికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో స్థలాలు కేటాయించడంతో లబ్ధిదారులు విముఖత వ్యక్తం చేశారు.ఆ స్థలాలు మాకొద్దు మార్చాలని డిమాండ్‌ చేశారు. అయినా ఫలితం లేకపో యింది. ఇక రాజ మహేంద్రవరం రూరల్‌ మండలం వేమ గిరిలోనూ పనికిరాని స్థలాలను పేదలకు ఇచ్చారు. వేమగిరి కొండదిగువన స్థలాలు కేటాయిం చినట్టు సమాచారం. దీనిపై గతంలో కడియం మండల కార్యాలయాన్ని మహి ళలు పెద్ద ఎత్తున ముట్టడించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. నాలుగు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని నాటి కలెక్టర్‌ మాధవీలత హామీ ఇచ్చా రు. నేటికీ ఆ హామీ అలాగే మిగిలి ఉంది. జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలోనూ ఇదే పరి స్థితి నెలకొంది. ఏకంగా ఆవ భూములనే స్థలాలుగా కేటాయించారు. బూరుగుపూడి వద్ద నివాస యోగ్యం కాని సుమారు 600 ఎకరాల ఆవ భూమిని ఎంపిక చేశారు. అప్పటి కలెక్టర్‌ కూడా వైసీపీ నాయకులకు తన వంతు సహకారాన్ని అందించారు. ఇదే అదనుగా వందల కోట్ల రూపాయలు నొక్కుడుకు తెర తీశారు. ఎకరం ఏడు లక్షలు కూడా చేయని భూములను ఏకంగా రూ.45 లక్షలు పెట్టి కొనడానికి ప్లాన్‌ వేశారు. ఆ సొమ్ములు భూమి ధర రైతుకు ఇచ్చేసి మిగతా సొమ్మును భారీగా దోపిడీ చేయాలనుకున్నారు. ఈ తంతంగంలో సుమారు రూ.500 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లు వెత్తాయి. భూమిని చదును చేయడానికి కూడా కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఈ వ్యవహారం వైసీపీలోని ఇద్దరు మాజీ ప్రజాప్రతినిధుల మధ్య గొడవకు దారితీ సినట్టు సమాచారం.ఈ భూముల్లో పట్టాలంటూ వేలాది మందికి పత్రాలను పంచి పెట్టారు.కానీ ఇప్పటికీ అక్కడ జనం నివసించడానికి సాహసించడం లేదు.అయితే స్థానిక రైతులు భూముల్లో మొక్కజొన్న తదితర పంటలు సాగు చేసుకుంటున్నారు. దీంతో ప్రజల ఇళ్ల పేరిట అప్పటి ప్రభుత్వం ఖర్చు పెట్టిన కోట్లాది రూపాయలు ఎవరి గళ్లా పెట్టెలోకి వెళ్లాయో సీబీసీఐడీతో వెలికి తీయించాలనే డిమాండ్లు బలంగా వినవస్తున్నాయి. ఈ దోపిడీపై మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావు అప్పట్లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఇక ఎన్నిక షెడ్యూల్‌కి వారం ముందు నుంచీ మాజీ ఎంపీ భరత్‌ రామ్‌ కొత్త సినిమాకు తెరతీశారు. కాగితంపై స్థలాలను చూపిస్తూ కనికట్లు చేద్దామను కున్నారు. అసలు భూమి లేకుండా 25 వేల పట్టాల పంపిణీ అంటూ హడావుడి మొదలు పెట్టారు.వారం పాటు మునిసిపల్‌, సచివాలయ సిబ్బందికి నిద్రాహారాలు లేకుండా చేసి పట్టాలను తయారుచేయించారు. కానీ ఆ స్థలాలు ఎక్కడ ఉన్నాయో మాత్రం చూపించలేక పోయా రు. దీనిపై లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. సీతంపేటకు చెందిన ఒక లబ్ధిదారురాలు తన స్థలం చూపించాలని ఎంత మొత్తుకున్నా సచివాలయ సిబ్బంది మాత్రం సాహసం చేయలేకపోయారు.మాజీ ఎంపీ హడావుడిగా పప్పూబెల్లం మాదిరిగా ఇచ్చేసిన పట్టాలకు సంబంధించిన స్థలాలను తమకు చూపించా లని.. లేకపోతే బహిరంగంగా క్షమాపణచెప్పాలని పెద్ద సం ఖ్యలో డిమాండ్లు వినిపిస్తున్నాయి.

సారూ.. మా స్థలం ఎక్కడ?

గత వైసీపీ ప్రభుత్వం ఓట్ల కోసం చేప్పిన అబద్ధాలకు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం సమాధానం చెపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గత ఐదేళ్లలో రాజమహేంద్రవరంలో 20 వేల ఇళ్ల పట్టాలు ఇచ్చినట్టు వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇంకా 50 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే సిటీ నియోజకవర్గ పరిధిలో పట్టాలు ఇచ్చారు కానీ స్థలాలు చూపించకపోవడం గమనార్హం. దీంతో ప్రస్తుత కూటమి ప్రజాప్రతినిధులు సమస్యలు తెలుసుకోడానికి ప్రజల వద్దకు వెళుతుంటే వారు వైసీపీ ఇచ్చిన మోళీ పట్టాలతో స్వాగతం పలుకుతున్నారు. తమ స్థలాలు చూపించాలని అభ్యర్థిస్తున్నారు. దీంతో వారిని సముదాయించడం టీడీపీ నేతలకు పెద్ద పనిగా మారిపోయింది. అసలు స్థలాలే లేకుండా పట్టాలు చేతిలో పెట్టి మోసం చేశారని వివరిస్తుంటే పాపం ఆ పేదలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇక కాలనీలు అంటూ మొదలు పెట్టి అతీగతీ లేకుండా వదిలేసిన ఇళ్ల మాటేమిటని ప్రశ్నిస్తున్న లబ్ధిదారులూ ఉన్నారు. వాళ్లనూ తాము ఆదుకుంటామని టీడీపీ నేతలు హామీ ఇస్తున్నారు. గతంలో తమ హయాంలో జరిగిన ఇళ్ల పంపిణీ మాదిరిగానే పారదర్శకంగా సొంత ఇంటి కల నెరవేరుస్తామని చెబుతున్నారు. ఇప్పుడు నిజంగా టీడీపీ ప్రజా ప్రతినిధులపై ఉన్న పెద్ద బాధ్యత కూడా ఇదే. ప్రభుత్వ కార్యాలయాల్లో మగ్గిపోతున్న దరఖాస్తుల దుమ్ము దులిసి తగు విచారణ చేయించి ఇంటి సదు పాయం కల్పించాల్సిన అవసరం ఉంది. వైసీపీ ప్రభు త్వంలో దగా పడిన పేదోడి గూడుకు రూపం ఇవ్వాల్సిన నైతికత కూడా ఈ పాలకులపైనే ఉంది.

స్థలాల అవినీతిపై సీబీసీఐడీ విచారణ..

గత వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల పట్టాల్లో భారీ మోసమే జరిగింది.. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో అయితే స్థలాలు చూపకుండానే పట్టాలిచ్చేశారు. ముందు పనికిరాని ఆవ భూములను కొనుగోలు చేసి ప్రజలను మభ్యపెట్టారు. ఇది చాలా దారుణం. దీనిపై సీబీసీఐడీ విచారణ జరిపించాలి. ఈ మేరకు సీఎంకు విన్నవిస్తా. పేదలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వం.. అందరికీ నివాసయోగ్యమైన స్థలాలు ఇస్తాం.

ఆదిరెడ్డి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే, రాజమహేంద్రవరం సిటీ

Updated Date - Jul 08 , 2024 | 12:14 AM