Share News

చంపింది పులా? పిల్లా!?

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:43 AM

గుర్తు తెలియని జంతువుల దాడిలో 12 పందెం పుంజులు,8 కోడి పిల్లలు మృత్యువాత పడ్డాయి.

చంపింది పులా? పిల్లా!?
పీకలు కొరికేయడంతో చనిపోయిన కోళ్లు..

వైల్డ్‌ క్యాట్‌ దాడిచేసిందంటున్న అధికారులు

చీపురుగూడెంలో ఘటన

నల్లజర్ల,ఫిబ్రవరి 14 : గుర్తు తెలియని జంతువుల దాడిలో 12 పందెం పుంజులు,8 కోడి పిల్లలు మృత్యువాత పడ్డాయి.నల్లజర్ల మండలం పోతవరం గ్రామానికి చెందిన పిన్నమని దుర్గారావు చీపురుగూడెంలో కొంత భూమిని కౌలుకు తీసుకుని నాటు కోళ్ళ పెంపకం ప్రారంభించాడు. చుట్టు నెట్‌ కట్టి అందులో 50 కోళ్ల వరకు పెంచుతున్నాడు. ప్రతి రోజూ రాత్రి సమయంలో కోళ్లను చూసుకుని వెళ్లే అలవాటు ఉన్న రైతు దుర్గారావు మంగళవారం రాత్రి 11 గంటలకు కోళ్ళ వద్దకు వెళ్లి చూడగా కొన్ని కొన ఊపిరితో కొట్టుకుంటున్నాయి.కొన్ని కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఇటీవల ఇక్కడి నుంచి వెళ్లిపోయిన పులి మళ్లీ వచ్చి ఉంటుందని కంగారుపడిన రైతులు ఫారెస్ట్‌ అధికారులకు ఫోన్‌ సమాచా రం అందించారు. ఈ మేరకు బుధవారం ఉదయం చీపురుగూడెం వచ్చిన ఫారెస్ట్‌ అధికారి శ్రీనివాస్‌ వారి సిబ్బంది పాదముదలు సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పాదముద్రలు పులి,చిరుత పులివి కావని నిర్ధారణకు వచ్చి అడవి జంతువులు కోళ్ళపై దాడి చేయలేదని చెప్పారు.పశు వైద్య శాఖ ఏడీఏ మోజేష్‌ తన బృందంతో మృతిచెందిన కోళ్ళను పరిశీలిం చారు. కేవలం తలపై మాత్రమే దాడి చేసి రక్తం పీల్చి ఉండడంతో పొలంలో ఉన్న పెద్ద సైజు జంగు పిల్లులు,బావుర పిల్లులు (వైల్డ్‌ క్యాట్‌) వంటి జాతులు మాత్రమే రక్తం పీల్చి చంపి ఉంటాయని అంచనా వేశారు. 20 కోళ్లు మృత్యువాత పడడం ద్వారా సుమారు 3 లక్షల నష్టం వచ్చినట్టు రైతు దుర్గారావు తెలిపాడు. రెండు పందెం పుంజులు (డాబర్‌)రెండు లక్షలు విలువ ఉంటుందన్నారు.మొన్నటి వరకు చీపురుగూడెం ఫారెస్ట్‌లో పెద్ద పులి సంచరించి ప్రజలను,రైతులు,రైతు కూలీలను భయందోళనకు గురి చేస్తే ప్రస్తుతం వైల్ట్‌ క్యాట్‌ దాడి వల్ల రైతులు మరింత భయపడుతున్నారు . ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని రైతు వేడుకుంటున్నాడు.

Updated Date - Feb 15 , 2024 | 12:43 AM