బడి బాగుకు రూ.10 లక్షల విరాళం
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:55 AM
పుట్టిన ఊరుని.. కన్నతల్లిని మరవకూడద నేది పెద్దల మాట.. నేడు ఊరు దాటితే చాలు పుట్టిన ఊరు గురు తే ఉండడం లేదు. అటువంటిది తను పుట్టిన ఊరుకోసం ఏదో ఒకటి చేయాలనుకున్నాడు.. వాళ్లను..వీళ్లను సంప్రదించగా బడిలో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పుకొచ్చారు..

కడియం, జూలై 27 : పుట్టిన ఊరుని.. కన్నతల్లిని మరవకూడద నేది పెద్దల మాట.. నేడు ఊరు దాటితే చాలు పుట్టిన ఊరు గురు తే ఉండడం లేదు. అటువంటిది తను పుట్టిన ఊరుకోసం ఏదో ఒకటి చేయాలనుకున్నాడు.. వాళ్లను..వీళ్లను సంప్రదించగా బడిలో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.. అంతే సమస్యలన్నీ తీరుస్తానని రంగంలోకి దిగారు. పాఠశాల అభివృద్ధికి సుమారు రూ.10 లక్షలు ప్రకటించారు. పనులకు శనివారం శ్రీకారం చుట్టారు. కడియం మండలం దుళ్ళ గ్రామానికి చెందిన యన్నమని లక్ష్మినారాయణ (నర్సరీలక్ష్మిపతి) తన తల్లిదండ్రులు శ్రీరాములు-సావిత్రిల పేరిట తమ గ్రామంలో ఉన్న పాఠశాల అభివృద్ధికి రూ. 10 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రహరీగోడ ఎత్తు చేయడం, పాఠశాల పేరు బోర్డును సిమెంట్ స్థంభాలతో పునః నిర్మాణం, కిచెన్‌షెడ్‌కు గోడల నిర్మాణం, బాలుర టాయిలెట్స్, బాలికల టాయలెట్స్ అభివ్దృద్ధి, సైకిల్‌షెడ్ అభివృద్ధి, పాఠశాలలో కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా మినీస్టేజ్ నిర్మాణం తదితర అభివృద్ధిఽ పనులు చేయిస్తున్నారు. ఈ మేరకు పాఠశాల హెచ్‌ఎం సంధ్యారాణి,యన్నమని లక్ష్మిపతి, మాజీ సర్పంచ్ గుర్రపు సత్యనారాయణ గ్రామస్థులు అభినందనలు తెలిపారు.