Share News

గ్యాస్‌ నొప్పి అనుకున్నాడు..

ABN , Publish Date - Apr 14 , 2024 | 12:54 AM

గుండె వద్ద పోటు వస్తోం ది.. అయినా విధులకు వెళ్లే కం గారు..ఏం కాదులే గ్యాస్‌ నొప్పి అనుకున్నాడు..ఎందుకంటే అత నికి కేవలం 36 ఏళ్లు.. అయితే మోటార్‌ సైకిల్‌పై అలా విధు లకు వెళ్లాడో లేదో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

గ్యాస్‌ నొప్పి అనుకున్నాడు..
కెల్లా సురేంద్ర(ఫైల్‌)

రాజానగరం, ఏప్రిల్‌ 13 : గుండె వద్ద పోటు వస్తోం ది.. అయినా విధులకు వెళ్లే కం గారు..ఏం కాదులే గ్యాస్‌ నొప్పి అనుకున్నాడు..ఎందుకంటే అత నికి కేవలం 36 ఏళ్లు.. అయితే మోటార్‌ సైకిల్‌పై అలా విధు లకు వెళ్లాడో లేదో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.రాజానగ రం గ్రామానికి చెందిన కెల్లా సురేంద్ర(36) రాజమహేంద్రవరంలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. శనివారం ఉదయం ఇంటి నుంచి మోటార్‌ సైకిల్‌పై డ్యూటీకి బయలుదేరాడు. ఇంటి వద్ద ఛాతిలో నొప్పిరావడంతో గ్యాస్‌ నొప్పిగా భావించి లెక్క చేయలేదు. రాజమహేంద్రవరం చేరు కునే సరికి నొప్పి అధికం కావడంతో పోలీసులు,తోటి ఉద్యోగులు హుటాహుటిన సమీపంలోని ప్రభుత్వ ఆసు పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెంది నట్టు వైద్యులు ధ్రువీకరించారు.మృతుడికి భార్య,ఇద్దరు కుమారులు ఉన్నారు.సురేంద్ర మరణవార్త విన్న భార్య హతాశు రాలైపోయింది..ఇప్పుడే కదా నా కళ్లెదుటే వెళ్లారు..ఇలా ఎలా జరిగిందంటూ కంగారుపడిపో యింది. భర్త అచేతనంగా పడి ఉండడం చూసి కన్నీటి పర్యంతమైంది. నొప్పి అంటే గ్యాస్‌ నొప్పి అనుకున్నాను ఇలా జరుగుతుందనుకోలేదని బోరున విలపించింది. తోటి ఉద్యోగులు, స్నేహితులు రాజానగరం చేరుకుని కుటుంబీకులను ఓదార్చారు. కుటుంబాన్ని ఆదుకోవా లని పలువురు పెద్దలు డిమాండ్‌ చేశారు.

Updated Date - Apr 14 , 2024 | 12:54 AM