Share News

సరాదా కోసం వెళ్లి తిరిగి రాని లోకాలకు..

ABN , Publish Date - Feb 12 , 2024 | 01:14 AM

మండల పరిధిలోని యర్రపోతవరం లా కుల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పామర్రు ఎస్‌.ఐ. జానీ బాషా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

సరాదా కోసం వెళ్లి తిరిగి రాని లోకాలకు..

యర్రపోతవరం లాకుల వద్ద రోడ్డు ప్రమాదం

ఇద్దరు యువకుల మృతి

కె.గంగవరం/అనపర్తి, ఫిబ్రవరి 10: మండల పరిధిలోని యర్రపోతవరం లా కుల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పామర్రు ఎస్‌.ఐ. జానీ బాషా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం అనపర్తి సావరంకు చెందిన దుర్గాడ జానీ(26), లక్ష్మీనరసాపురంకు చెందిన పిల్లి ప్రసాద్‌(28)లు మరో ఇద్దరు స్నేహి తులతో కలసి ఆదివారం ఉదయం యానాం వెళ్ళారు. అక్కడ పని ముగించుకు ని తిరిగి యానాం నుంచి అనపర్తి వెళుతున్న సందర్భంలో యర్రపోతవరం లాకుల వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో జానీ, ప్రసాద్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. రామచంద్రపురం డీఎస్పీ బి.రామకృష్ణ, సి.ఐ. పి.దొరరాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మరణించిన ప్రసాద్‌, జానీ మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించినట్లు చెప్పారు. ప్రసాద్‌, జానీ మరణంతో రెండు కుటుంబాలు వారు కుటుంబ పెద్దలను కోల్పోయారు. వీరిలో జానీకి చదువుకు ంటున్న తమ్ముడు, ప్రసాద్‌కు పెళ్లీడుకు వచ్చిన చెల్లెలు ఉన్నారు. వీరి మరణం తో అనపర్తి సావరం, లక్ష్మీనరసాపురం గ్రామాల్లో విషాదం అలుముకుంది.

రెండు కుటుంబాల్లో విషాదం

ఆదివారం పనికి సెలవు కావడంతో స్నేహితులు సరదాగా గడిపేం దుకు యానాం వెళ్లి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పాయారు. చేతికందిన కొడుకులు ప్రాణాలు కోల్పోవడంతో రెండు కుటుంబాలలోను విషాద ఛాయలు అలుముకున్నాయి. అనపర్తి మండలం లక్ష్మీనరసాపురానికి చెందిన పిల్లి ప్రసాద్‌(26), అనపర్తి సావరంనకు చెందిన దుర్గాడ జానీ(28) స్నేహితులు. ఇద్దరూ అవివాహితులే.. తాపీ పనిచేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇద్దరికీ తండ్రులు లేకపోవడంతో రెండు కుటుంబాలకు వారే ఆధారం కావడంతో రెండు కుటుంబాల వారు అనాథలుగా మిగిలారు. ఆదివారం తాపీ పనికి సెలవు కావడంతో ఇద్దరూ మోటారుసైకిల్‌పై యానాం వెళ్లి సరదాగా గడిపారు. తిరుగు ప్రయాణంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమజిల్లా కె.గంగవరం మండలం ఎర్రపోతవరం లాకులవద్దకు చేరుకునే మోటార్‌సైకిల్‌.. లారీని ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. భర్తలు లేరు.. కడవరకు తమను చూసుకుంటారని గంపెడు ఆశలు పెట్టుకున్న ఆ తల్లులు.. కుమారులు అర్ధాంతరంగా తమను విడిచి వెళ్లిపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ఇద్దరు యువకుల మృతితో రెండు గ్రామా ల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - Feb 12 , 2024 | 01:14 AM