Share News

నేనూ గురుకులం విద్యార్థినే..

ABN , Publish Date - Dec 30 , 2024 | 12:31 AM

తాను కూడా గురుకుల పాఠశాల్లోనే విద్యనభ్యసించానని ఎస్పీ నరసింహ కిషోర్‌ అన్నారు. గోకవరం మండలం భూపతిపాలెం గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థుల(1984 నుంచి విద్య నభ్యసించిన విద్యార్థులు) మహా సమ్మేళనం ఆదివారం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్ర విచ్చేశారు.

 నేనూ గురుకులం విద్యార్థినే..
భూపతిపాలెం మహా సమ్మేళనంలో మాట్లాడుతున్న ఎస్పీ కిషోర్‌

  • జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌

  • భూపతిపాలెం గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం

గోకవరం, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): తాను కూడా గురుకుల పాఠశాల్లోనే విద్యనభ్యసించానని ఎస్పీ నరసింహ కిషోర్‌ అన్నారు. గోకవరం మండలం భూపతిపాలెం గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థుల(1984 నుంచి విద్య నభ్యసించిన విద్యార్థులు) మహా సమ్మేళనం ఆదివారం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్ర విచ్చేశారు. ఎస్పీ కిషోర్‌ మాట్లాడుతూ గురుకు ల పాఠశాలల్లో చది విన విద్యార్థులు చదు వులతోపాటు క్రీడ ల్లోనూ విశేష ప్రతిభ కన బర్చడం ఆన వాయితీగా వస్తుందన్నా రు. పాత జ్ఞాపకాలను విద్యార్థులతో నెమరు వేసు కున్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రతీ వ్యక్తి ఉన్నత విద్యావంతుడై అన్నిరం గాల్లో రాణిస్తేనే ఆర్థిక ఒడుదుడుకులు లేకుండా జీవించగలమ న్నారు. గురుకుల పాఠశాల సమీపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఎడ్యుకేషనల్‌ హబ్‌, జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయనున్నామన్నారు. రానున్న కాలంలో గురు కుల పాఠశాల్లో అన్ని మౌలిక వసతులు కల్పిం చేందుకు తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని నెహ్రూ అన్నారు. అనంతరం ప్రస్తుతం పాఠశాల్లో విద్యనభ్యసి స్తున్న సుమారు 480 విద్యార్థులకు పూర్వ విద్యార్థులు సమకూర్చిన పరుపులను అందజే శారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్‌ గళ్లా రాముతో పాటు, సుమారు 2వేల మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

  • 40 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు..

బిక్కవోలు, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): మండలంలోని కొంకుదురు యూపీ పాఠశాలలో 1984లో ఆరో తరగతి చదువుకున్న విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో కలసి ఆదివారం మారేడుమిల్లిలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో చిన్నప్పుడు చేసిన అల్లరి చేష్టలను గుర్తుకు తెచ్చుకున్నారు. వీరిలో చిన్నం వెంకటరె డ్డి జ్యోతి దంపతుల 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆ దంపతులను సత్కరించి సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో కొమరిపాలెం డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడు కొవ్వూరి వేణుగోపాలరె డ్డి, ఎంపీటీసీ పీవీ, చింతా శ్రీనివాసరెడ్డి, ఎస్‌వీ సూర్యనారాయణరెడ్డి, చిన్నం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • ‘షాడే’ పూర్వవిద్యార్థుల సమ్మేళనం

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 29(ఆంరఽధజ్యోతి): రాజమహేంద్రవరంలో షాడే ఇంగ్లీషు మీడియం హైస్కూల్‌ 2000-01 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. స్థానికంగా ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాలులో బేతంపూడి జాన్‌ నవీన్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పొన్నల దినకర్‌, చెగుండి సుజిత్‌, బత్తుల చాముండేశ్వరి, యర్రగుంట శివప్రసాద్‌, కృష్ణంరాజు తదితరులు హాజరయ్యారు. 24 ఏళ్ల క్రితం వారు చేసిన అల్లరి చేష్టలను, పొందిన మధుర అనుభూతులను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను సత్కరించారు.

Updated Date - Dec 30 , 2024 | 12:31 AM