‘గురుకులం’లో ప్రవేశాలు
ABN , Publish Date - Aug 24 , 2024 | 12:39 AM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల రాజోలు బాలికల పాఠశాల, కళాశాలల్లో ఐదో తరగతి, 6వ తరగతి, ఇంటర్మీడియట్‌లో ఖాళీల సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ప్రిన్సిపాల్ టి.లలితకుమారి శుక్రవారం తెలిపారు.
రాజోలు, ఆగస్టు 23: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల రాజోలు బాలికల పాఠశాల, కళాశాలల్లో ఐదో తరగతి, 6వ తరగతి, ఇంటర్మీడియట్‌లో ఖాళీల సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ప్రిన్సిపాల్ టి.లలితకుమారి శుక్రవారం తెలిపారు. 5వ తరగతిలో 39 సీట్లు, 6వ తరగతిలో 11సీట్లు, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 5, బైసీపీలో 6 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈనెల27వ తేదీ ఉదయం 10గంటలలోపు పాఠశాల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆధార్, టీసీ, మార్కుల లిస్టు, సంబంధిత సర్టిఫికెట్లతో పాఠశాలలో సంప్రదించాలన్నారు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు లాటరీ పద్ధతిలో సీట్లు కేటాయిస్తామన్నారు.