Share News

ఘనంగా ప్రపంచ ఆటిజం దినోత్సవం

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:53 AM

వాకలపూడి ఉమా మనో వికాస కేంద్రం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎస్‌పీ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సర్పవరం జంక్షన్‌లో ఎస్‌ఆర్‌ఎంటీ ఫంక్షన్‌ హాల్లో ఘనంగా ప్రపంచ ఆటిజం (అంతుర్మఖి) దినోత్సవం నిర్వహించారు.

ఘనంగా ప్రపంచ ఆటిజం దినోత్సవం

సర్పవరం జంక్షన్‌, ఏప్రిల్‌ 2: వాకలపూడి ఉమా మనో వికాస కేంద్రం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎస్‌పీ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సర్పవరం జంక్షన్‌లో ఎస్‌ఆర్‌ఎంటీ ఫంక్షన్‌ హాల్లో ఘనంగా ప్రపంచ ఆటిజం (అంతుర్మఖి) దినోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్‌జెండర్‌, వృద్ధుల సంక్షేమశాఖ ఏడీ పి.నారాయణమూర్తి మాట్లాడుతూ ఆటిజం అనేది తల్లి గర్భంలో బేబీ ఉన్నప్పుడు మొదటి మూడునెలలు కీలకమని, జన్యుపరంగా, సీజర్స్‌, మెనిన్‌ జైటిస్‌ వంటి వాటితో ఆటిజం వస్తోంద న్నారు. విస్తతస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించడంతో ఆటిజం నుంచి ఆరోగ్యవంతమైన సమాజంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా చక్కటి నాటిక రూపంలో ఆటిజంపై విద్యార్థులు ప్రదర్శించిన నాటిక ఆకట్టుకుంది. కార్యక్రమంలో సంస్థ పీడీ కె.నారాయణరెడ్డి, ఎస్‌.ఉమా రెడ్డి, ఎస్‌ఏ నాయుడు, రాంజీ అంబేద్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

భవిత కేంద్రాలతో దివ్యాంగులకు మంచి భవిష్యత్‌

కోటనందూరు : అటిజంతో బాధపడుతున్న చిన్నారులకు భవితకేంద్రాల ద్వారా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ అన్నారు. మంగళవారం పాఠశాలల్లో ప్రపంచ అటిజం దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఈఆర్‌పీలు నాగ గోవింద్‌ నారాయణరావు పాల్గొన్నారు.

పిల్లల ప్రవర్తన గుర్తించాలి

ఏలేశ్వరం: ప్రపంచ ఆటిజం డే సందర్భంగా తల్లిద్రండులకు అవగాహన కల్పించారు. మంగళవారం స్థానిక భవిత కేంద్రంలో ఆటిజండే పురస్కరించుకొని భవిత కేంద్రం ఉపాధ్యాయులు వాణిపద్మజ, బుజ్జి తల్లిద్రండులకు పిల్ల్లల ప్రవర్తన, వారి విధివిధానాలు తల్లిద్రండులు గమనించాలన్నారు.

నవోదయా పరీక్షా ఫలితాలు విడుదల

పెద్దపురం, ఏప్రిల్‌ 2: జవహర్‌ నవోదయా విద్యాలయంలో 2024-25కి సంబంధించి ఆరవతరగతిలో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షల ఫలితాలు ఈనెల 2వ తేదీన విడుదలైనట్లు విద్యాలయ ప్రిన్సిపాల్‌ ఆర్‌.కమలం తెలి పారు. 8506 మంది విద్యార్థులు పరీక్షల కు హాజరుకాగా వారిలో 80 మంది విద్యార్థులు ఎంపికయ్యారని తెలిపారు. ఎంపికైన విద్యార్థులు విద్యాలయానికి వచ్చి అడ్మిషన్‌కు సంబంధించిన పత్రాలను తీసుకోవాలని ఆమె కో

Updated Date - Apr 03 , 2024 | 12:53 AM