Share News

వైభవంగా సత్యదేవుడి ఆవిర్భావ దినోత్సవం

ABN , Publish Date - Aug 07 , 2024 | 01:01 AM

రత్నగిరివాసుడైన సత్యదేవుడి ఆవిర్భావ దినోత్సవం మంగళవారం కనులపండువగా జరిగింది. వేకువజామున రెండుగంటలకు స్వామి,అమ్మవార్లను సుప్రభాతసేవతో మేల్కొలిపి అభ్యంగనస్నానమాచరింప చేశారు.

వైభవంగా సత్యదేవుడి ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా ఆయుష్య హోమం

పోటెత్తిన భక్తులు

అన్నవరం, ఆగస్టు 6: రత్నగిరివాసుడైన సత్యదేవుడి ఆవిర్భావ దినోత్సవం మంగళవారం కనులపండువగా జరిగింది. వేకువజామున రెండుగంటలకు స్వామి,అమ్మవార్లను సుప్రభాతసేవతో మేల్కొలిపి అభ్యంగనస్నానమాచరింప చేశారు. మహన్యాసపూర్వక రుద్రాభిషేకం అనంతరం పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. మూలవరులకు దివ్యాభరణాలు, నూతన పట్టువస్త్రాలను ధరింపచేసి, సర్వదర్శనాలను ఉదయం 7.30కు ప్రారంభించారు. 9గంటలకు ఆయుష్య హోమం ప్రారంభించి పండితులను ఈవో రామచంద్రమోహన్‌ సత్కరించారు. 11గంటలకు ఆయుష్యహోమ పూర్ణాహుతి గావించారు. చతుర్వేదపండితుల వేదాశీర్వచనాలు అనంతరం భక్తులకు కదంబం ప్రసాదాన్ని వితరణ చేశారు. ఈసందర్భంగా ఆలయాన్ని వివిధ పుష్పాలతో అలంకరించారు. తూర్పురాజగోపురాన్ని పచ్చదనంతో నింపారు. అనివేటి మండపం వెలుపల ఏర్పాటుచేసిన స్వామివారి ఆవిర్భావ దినోత్సవ పుష్పాలంకరణ సూచిక విశేషంగా ఆకట్టుకుంది. భక్తులు ఆ ప్రాంతంలో నిలబడి తమ కెమెరాలలో స్వీయచిత్రాలను బందించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భా గంగా ఏర్పాటుచేసిన నృత్యప్రదర్శన, కోలాటం ఆకట్టుకున్నాయి.

అన్నవరం దేవస్థానంలో దాతలకు ప్రత్యేక సౌకర్యాల కల్పనకు డిజిటల్‌ కార్డులు

రూ.లక్ష దాతలకు గోల్డ్‌, రూ.10లక్షలకు డైమండ్‌, ఆపై ప్లాటినం కార్డులు

అన్నవరం, ఆగస్టు 6: దేవాలయాలలో దాతలకు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించడం ద్వారా ఆలయాలలో అభివృద్ధి పనులు మరింతగా జరుగుతాయని ఈవో రామచంద్రమోహన్‌ పేర్కొన్నారు. మంగళవారం అనివేటి మండపంలో జరిగిన కార్యక్రమంలో తొలికార్డును తునికి చెందిన చక్కా తాతబాబుకు అందజేశారు. దేవస్థానంలో వివిధ పథకాలకు విరాళం అందించిన దాతల వివరాలను ఆన్‌లైన్‌ చేసి వారిచ్చిన విరాళాలను బట్టి కార్డులను జారీచేస్తారు. రూ.లక్ష విరాళమిచ్చిన వారికి గోల్డ్‌, రూ.10లక్షలు విరాళమిచ్చిన వారికి డైమండ్‌, రూ.10లక్షలు పైబడి విరాళమిచ్చేవారికి ప్లాటినం కార్డులు అందజేయనున్నారు. వీటిద్వారా భక్తులు ఏ కార్యాలయంను సంప్రదించకుండా నేరుగా వారికి కావాల్సిన సౌకర్యాలు అందజేస్తారు. గదుల కేటాయింపు, ప్రత్యేక దర్శనాలు, ఇతర సదుపాయాలు వీటిలో ఉంటాయి. దీంతోపాటుగా వాట్సాప్‌ చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు వెల్లడించారు.

వజ్ర కిరీటం, వజ్ర కర్ణాభరణాలకు శాస్త్రోక్తంగా సంప్రోక్షణ

ఇప్పటివరకు వజ్రకిరీటధారిగా భక్తులకు దర్శనమిస్తున్న సత్యదేవుడు, మంగళవా రం నుంచి దేవేరి అనంతలక్ష్మి అమ్మవారు వజ్రకిరీటంలో దర్శనమిచ్చారు. సోమవారం దాత మట్టే సత్యప్రసాద్‌ దంపతులు దేవస్థానం అధికారులకు వీటిని అందించిన సంగ తి విధితమే మంగళవారం వేకువజామున వజ్రకిరీటం, వజ్రకర్ణాభరణాలకు శాస్త్రోక్తంగా దాత దంపతులచే పండితులు సంప్రోక్షణ, ఇతర పూజాధికాలు నిర్వహించారు. అనంత రం 7గంటలకు స్వామి,అమ్మవార్లను వజ్రకిరీటం, వజ్రకర్ణాభరణాలతో భక్తులకు దర్శనమిచ్చారు. ఈసందర్భంగా స్వామి,అమ్మవార్లను నూతనంగా దర్శనమివ్వడంతో భక్తులు తన్మయత్వం చెందారు.

అన్నవరం దేవస్థానం ఇన్‌చార్జి ఈవోగా రమేష్‌బాబు

అన్నవరం దేవస్థానం ఈవో రామచంద్రమోహన్‌ తన కుమార్తె వివాహం కారణంగా ఈనెల 20వ తేదీవరకు సెలవుపై వెళ్లనుండడంతో ఆయన స్థానం లో ఇన్‌చార్జి ఈవోగా అన్నవరం దేవస్థానం డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న డీఎల్‌వీ రమేష్‌బాబును నియమిస్తూ దేవదాయశాఖ ఉన్న తాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సుమారు 10సంవత్స రాలుగా ఆయన అన్నవరం దేవస్థానంలో సహాయ కమిషనర్‌గాను, ఏడాదిపాటు డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తూ పాలనాపరమైన వ్యవహారాల్లో ఆయనకు అనుభవం ఉండ డంతో దేవదా యశాఖ ఉన్నతాధికారులు ఆయన సేవలను గుర్తించి ఇన్‌చార్జి పదవి అప్పగించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి ఈవో మాట్లాడుతూ సత్యదేవుడు తనకు ఇచ్చిన అవ కాశాన్ని భక్తుల సౌకర్యాల కల్పనకు పాటుపడతానని రమేష్‌బాబు తెలిపారు.

నేటి నుంచి భీమేశ్వరస్వామివారి దర్శనం

రెండో రోజు సంప్రోక్షణ కార్యక్రమాలు

ద్రాక్షారామ, ఆగస్టు 6: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ భీమేశ్వరస్వామివా, మాణిక్యాంబ అమ్మవార్ల మూలవిరాట్ల దర్శనానికి బుధ వారం ఉదయం 11 గంటల నుంచి అనుమతించనున్నారు. ఆలయంలో మూలవిరాట్‌ సంరక్షణ, అభివృద్ధి పనుల నేపథ్యంలో సోమవారం సంప్రోక్షణ పూజలు ప్రారంభించారు. మంగళవారం రెండోరోజు కూడా సంప్రోక్షణ పూజలు కొనసాగాయి. ఉదయం గణపతిపూజ, పుణ్యాహవాచనం, కుచ్చత్ర యం, పున:పూజలు, ఉదకశాంతి, శతరుద్రపారాయణ, శ్రీసూ క్త, దుర్గా సూక్తపారాయణ జరిగాయి. మధ్యాహ్నం శుక్తయజుర్వేదపారాయణ, రుద్రహోమం, చండీ హోమం, నీరాజనమంత్రపుష్పాలు సమర్పణ నిర్వహించారు. ఆలయ వేదపండిత బృందం, అర్చకులు, స్వస్తివాచకులు శాస్త్రోక్తంగా పూజాధికాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో పి.టి.వి.సత్యనారాయణ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

సామూహిక వరలక్ష్మీ వ్రత పూజలకు ఏర్పాట్లు

సామర్లకోట, ఆగస్టు 6: పంచారామ పుణ్యక్షేత్రమైన సామర్లకోట కుమార రామ భీమేశ్వరాలయంలో బాలాత్రిపురసుందరి అమ్మవారి మందిరం ఎదుట శ్రావణమాసం శుక్రవారాలలో భక్తులచే సామూహిక వరలక్ష్మీ వ్రత పూజలు నిర్వహించనున్నందున మహిళా భక్తులు అ పూజలలో పాల్గొనేందుకు ముందుగా ఆలయ కార్యనిర్వహణా ధికారి కార్యాలయంలో తమ గోత్ర, నామాలతో నమోదు చేసుకోవాలని ఆలయ కార్య నిర్వహణాధికారి బళ్ళ నీలకంఠం తెలిపారు. మొదటి శుక్రవారం ఈనెల 9న, మూడవ శుక్రవారం 23న, నాల్గవ శుక్రవారం 30న మహిళలచే సామూహిక వరలక్ష్మీ వ్రత పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పూజా సామగ్రి, ప్రసాదాలు తదితర సామగ్రి పలువురు దాతల సౌజన్యంతో అందజేస్తామన్నారు. సామూహిక వరలక్ష్మీ వ్రత పూజలలో పాల్గొనే భక్తులతోపాటు వెంట వచ్చిన మరొకరికి ఆలయ ఆవరణలో నిత్యాన్నదాన పఽథకంలో అన్నప్రసాదాలు అందజేయనున్నట్లు పేర్కొంటూ మహిళా భక్తులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈవో నీలకంఠం తెలిపారు.

Updated Date - Aug 07 , 2024 | 01:01 AM