Share News

వైభవంగా వెంకన్న కల్యాణం

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:33 AM

కోనసీమ తిరుమల వాడపల్లిలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వా మి దివ్య కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారి మేల్కొలుపు, నదీ జల సంగ్రహణం, విశేషార్చన, నిత్య హో మాలు, ద్రవిడ వేదపారాయణం లను శాస్త్రోక్తంగా జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

వైభవంగా వెంకన్న కల్యాణం

వాడపల్లి తిరువీధుల్లో శ్రీవారి రథోత్సవం, భక్తుల సందడి

ఆకట్టుకున్న కేరళ, చెన్నయ్‌ వాద్య కళాకారుల ప్రదర్శనలు

ఆత్రేయపురం, ఏప్రిల్‌ 19: కోనసీమ తిరుమల వాడపల్లిలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వా మి దివ్య కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారి మేల్కొలుపు, నదీ జల సంగ్రహణం, విశేషార్చన, నిత్య హో మాలు, ద్రవిడ వేదపారాయణం లను శాస్త్రోక్తంగా జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మేళతాళ, మంగళవాయిద్యాలతో స్వామివారిని తోడ్కొని వెళ్లి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. అనంతరం వివిధ కళాకారుల ప్రదర్శనల నడుమ తిరువీధుల్లో రథోత్సవం జరిగింది. ఆలయాన్ని ఫల, పుష్పాలు, విద్యుత్‌ దీపాలంకరణలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. తీర్థంలో యువకులు, భక్తులు వినోదాత్మక ప్రదర్శనలతో సందడి చేశారు. వివిధ స్వ చ్ఛంద సంస్థలు యాత్రికులకు భోజనం పెట్టడంతోపాటు మజ్జిగ చలివేంద్రాలద్వారా సేవలందించారు. వాడపల్లి పోరాటయోధుల స్థూపంవద్ద అమరవీరులకు దేవదాయ శాఖ ఆర్జేసీ విజయరాజు, ఉపకమిషనర్‌ భూపతిరాజు కిషోర్‌కుమార్‌ నివాళులర్పించారు.

కనుల పండువగా కల్యాణం

శ్రీనివాస ప్రాంగణంలో సర్వాంగసుందరంగా అలంకరించిన కల్యాణ వేదిక వద్దకు స్వామివారిని పల్లకీలో తోడ్కొని వచ్చి పెండ్లి కుమా రుడిని చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, మధుపర్కప్రాశన, కన్యాదానం, మహదాశీర్వచనంలను వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం ఖండవిల్లి వరప్రసాదాచార్యులు బ్రహ్మత్వంలో వేద పండితులు అర్చకులు ఘనంగా జరిపారు. గోవింద నామస్మరణ, మేళతాళ మంగళ వాయిద్యాలు, బాణసంచా కాల్పుల నడుమ జరిగిన స్వామివారి కల్యాణాన్ని భక్తులు తిలకించి పునీతులయ్యారు. కల్యాణ తంతు జరిగినంతసేపూ వందల కిలోల కర్పూర జ్యోతిని వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి పట్టువస్త్రాలను దేవదాయశాఖ అదనపు కమిషనర్‌ రామచంద్రమోహన్‌, ఆర్జేసీ ఎం.విజయరాజు సమర్పించారు. ఉప కమిషనరు, ఈవో భూపతిరాజు కిషోర్‌కుమార్‌-ఉమాసుందరి దంపతులు కల్యాణ కర్తలుగా వ్యవహరించారు. కొత్తపేట డీఎస్పీ కేవీ రమణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అధికారులు, సిబ్బందిఉత్సవాల్లో తమవంతు సేవలు అందించారు.

Updated Date - Apr 20 , 2024 | 01:33 AM