Share News

బై బై.. జే బ్రాండ్స్‌!

ABN , Publish Date - Jun 22 , 2024 | 12:30 AM

మందుబాబులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజులు త్వరలోనే రానున్నాయి.. ఐదేళ్లుగా ‘జే’ బ్రాండ్లతో ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకున్నారు.. నాణ్యమైన చుక్క పడి ఏన్నాళ్లయ్యిందో. వైసీపీ పెద్దల కమీషన్ల దెబ్బకు ఎంసీ, సియాగ్రామ్స్‌ వంటి అంతర్జాతీయ కంపెనీలు సైతం కనుచూపు మేరలో కనిపించకుండా పరుగు పెట్టాయి

బై బై.. జే బ్రాండ్స్‌!

జగన్‌ బ్రాండ్లకు మంగళం

డిపోలకు రవాణా నిలిపివేత

త్వరలో నాణ్యమైన సరుకు

మళ్లీ అంతర్జాతీయ బ్రాండ్లు

జిల్లాలో 158 మద్యం దుకాణాలు

బెల్ట్‌ షాపుల జోరు

పాత మద్యం పాలసీ తెచ్చే అవకాశం

కూటమి ప్రభుత్వ నిర్ణయం

ప్రైవేటు లైసెన్స్‌లకు ఎదురుచూపులు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

మందుబాబులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజులు త్వరలోనే రానున్నాయి.. ఐదేళ్లుగా ‘జే’ బ్రాండ్లతో ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకున్నారు.. నాణ్యమైన చుక్క పడి ఏన్నాళ్లయ్యిందో. వైసీపీ పెద్దల కమీషన్ల దెబ్బకు ఎంసీ, సియాగ్రామ్స్‌ వంటి అంతర్జాతీయ కంపెనీలు సైతం కనుచూపు మేరలో కనిపించకుండా పరుగు పెట్టాయి. బడ్వయిజర్‌, నాకవుట్‌ వంటి ఆదరణ కలిగిన బీర్లు కను మరుగయ్యాయి. మద్యం తయారీ కంపెనీలను వైసీపీ నాయకులు ఆక్రమించుకుని నాసిరకం మద్యాన్ని తయా రు చేసి దానిని ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా విక్ర యాలు జరిపేవాళ్లు.వాటిలో ప్రజల ఆరోగ్యాన్ని తినేసే రసాయనాలు ఉన్నాయని గగ్గోలు పెట్టినా జగన్‌కి పట్టిం పు లేకుండాపోయింది. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం కొలు వుదీరడంతో త్వరలోనే అంతర్జాతీయ కంపెనీల బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి.ఈ మేరకు ‘జే’ బ్రాండ్ల కొనుగోలును ఏపీఎస్‌బీసీఎల్‌ ఆపేసిందని తెలుస్తోంది.

ఉందిలే..మందుకాలం..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అంతర్జా తీయ కంపెనీలు తయారు చేసే ఎంసీ విస్కీ, బ్రాంది, ఇపీరియల్‌ బ్లూ(ఐబీ), ఓసీ ఒరిజినల్‌, ఏసీ బ్లాక్‌ ఒరి జినల్‌,మెన్స్‌క్లబ్‌, డైరెక్టర్‌ స్పెషల్‌(డీఎస్పీ), ఏసీ ప్రీమియం, అరిస్టోక్రాట్‌ ప్రీమియం, వీఎస్‌ఓపీ వంటి బ్రాండ్లు అందుబాటలోకి రానున్నాయి. అయితే దీనికి కొద్దిగా సమయం పట్టే అవకాశం ఉంది. అధికారులు, అమా త్యులు, ప్రభుత్వం కుదురుకోవాల్సి ఉంది. ఇంకా కొందరు మంత్రులు బాధ్యతలు స్వీకరించలేదు. అలాగే క్యాబినెట్‌ సమావేశం జరగలేదు. ఇవన్నీ అయిన తర్వాత ఎక్సైజ్‌ పాలసీలపై చంద్రబాబు సమీక్ష చేస్తారని చెబు తున్నారు. ప్రస్తుతం ఉన్న బార్లుకు అనుమతులు ఇంకా సుమారు ఏడాదిన్నర ఉన్నాయి. ప్రభుత్వం మద్యం షాపుల లైసెన్సు సెప్టెంబరు నెలాఖరు వరకూ ఉంది. దీంతో మద్యం పాల సీలను సమీక్షించాల్సి ఉంది. అయితే దానికంటే ముందే నాణ్యమైన బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు కసరత్తు మొదలు పెట్టారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే తయారీ కేంద్రాల నుంచి పిచ్చి బ్రాండ్ల కొనుగోలు నిలిపివేశారు.జిల్లాలో 137 ప్రభుత్వం మద్యం షాపులు,20 బార్లు ఉన్నాయి. వీటికి రాజమం డ్రిలోని ఏపీఎస్‌బీసీఎల్‌ డిపో నుంచి మద్యం సరఫరా చేస్తారు. అయితే ఈ డిపోకి బూమ్‌బూమ్‌, బ్లాక్‌బస్టర్‌ బీర్లు, గోల్డెన్‌ కింగ్‌, దారుహౌస్‌, ఆంధ్రాగోల్డ్‌, సుప్రీం, లీలా (వైసీపీ విజయ సాయిరెడ్డి కంపెనీ అని చెబుతారు) వంటి బ్రాండ్లను సరఫరా చేయడం ఇప్పటికే నిలిపి వేశారు. డిపోలో స్టాకు ఉన్నంత వరకూ దుకాణాలకు పంపిస్తున్నారు. తయారీ కంపెనీల నుంచి కొత్తగా ఈ బ్రాండ్లు డిపోకు రావడం లేదు. అలాగే ధరలపై కూడా పునఃసమీక్ష చేయనున్నారు. చీప్‌ లిక్కర్‌ కూడా నాసిరకం పోయి నాణ్యమైనది రానుంది.

పాతబ్రాండ్లకు చెల్లుచీటీ..

బూమ్‌ బూమ్‌ .. ప్రెసిడెంట్‌ మెడల్‌, స్పెషల్‌ స్టేటస్‌, హార్సెస్‌, ఓషన్‌ బ్లూ.. ఇలా రకరకాల పేర్లతో జగన్‌ గుంపు నాసిరకం మద్యం జనాల ప్రాణాలు తీసింది. మన రాష్ట్రంలో దొరికే మందు దేశంలో మరెక్కడా లభ్యమయ్యేది కాదు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లు అక్కడి నుంచి మద్యం తెచ్చుకొనే పరిస్థితి ఉండేది. దీనికి కారణం ‘జే’ బ్రాండ్లు. ఏది అమ్మితే అదే తాగాలనే దందా సాగింది.. మద్యం అలవాటు ఉన్నవారు ఎక్కువగా ఇష్టపడే బ్రాండ్లను ఆపేశారు. అదే సమయంలో ధరలను రెండింతలు పెంచేశారు. ఎంత చెల్లించినా నాణ్యమైన సరుకు గగనమైపోయింది. దీంతో మందుబాబులు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంచేపట్టడంతో జే బ్రాండ్లకు బై బై చెబు తున్నారు.. నాణ్యత కలిగిన మద్యం బ్రాండ్లకు జైకొడుతున్నారు.

మారనున్న మద్యం పాలసీ..

గతంలో టీడీపీ ప్రభుత్వం(2019కి ముందు) ఉన్న సమయంలో మద్యం పాలసీ పద్ధతి ప్రకారం నడిచేది. లైసెన్సు విధానంలో ప్రైవేటు షాపులకు అనుమతులు ఇవ్వడం జరిగేది. మద్యం ఎంఆర్పీ ధరపై వ్యాపారులకు ప్రభుత్వమే 15 శాతం వరకూ చెల్లించేది. దీంతో ఒక్క పైసా అదనంగా తీసుకోడానికి వీలుండేది కాదు. వైసీపీ ప్రభుత్వంలో దానిని రద్దు చేసి.. ఎంతకైనా విక్రయించు కోవచ్చనే వికృత జీవోను విడుదల చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలంటూ వైసీపీ మద్యం మాఫియాకు ఊతమిచ్చింది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో పాత విధానాన్నే అమల్లోకి తేవడానికి ఏర్పా ట్లు సాగుతున్నాయి.ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎత్తే యబోతున్నారని తెలుస్తోంది.ప్రైవేటు మద్యం దుకాణా లను లాటరీ విధానంలో కేటాయిస్తారనే చర్చ నడుస్తోం ది.ఆశావహులు ఆ నోటిఫికేషన్‌కు ఎదురు చూస్తున్నారు.

ఇకనైనా బెల్ట్‌ తీస్తారా?

మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం పెంపుపై తీవ్రంగా దృష్టి సారించిన వైసీపీ ప్రభుత్వం టార్గెట్లు పెట్టి మరీ ఎక్సైజ్‌ శాఖపై బాగా ఒత్తిడి పెంచింది. తద్వారా జనాలతో పూటుగా నాసిరకం మందు తాగించింది. 19 మండలాల్లో 158 మద్యం దుకాణాలు చాలవన్నట్టు గా వాక్‌ఇన్‌ స్టోర్స్‌ని తెరపైకి తెచ్చింది. వాటికి బెల్టుషాపులు జతకలిశాయి.టీడీపీ ప్రభుత్వ హయాంలో మందు కావాలంటే ప్రభుత్వం లైసెన్స్‌ ఇచ్చిన షాపునకు వెళ్లి కొనుక్కోవాల్సిందే. కానీ జగన్‌ మాత్రం గడప గడపకూ మందు అందాలన్నదే లక్ష్యంగా మద్యం పాలసీ చేశారు. నివాసాల మధ్యనే మద్యం షాపులు పెట్టారు. మద్యం అమ్మకానికి వీలైన ఏ ఒక్క అవకాశాన్నీ జగన్‌ వదల్లేదు. వీధికో బెల్టుషాపు పుట్టుకొచ్చింది. చివరికి చీఫ్‌ లిక్కర్‌ ధరను అమాంతం రూ.150 చేసేశారు. టీడీపీ హయాం లో నాణ్యమైన చీఫ్‌ లిక్కర్‌ రూ.60కే దొరికేది. ప్రభుత్వం మారడంతో ఇప్పుడు బెల్టుషాపులపై యంత్రాంగం బెల్టు తీయనుంది. జగన్‌ ఆర్భాటంగా తీసుకొచ్చిన (సెబ్‌)ని కూడా సెట్‌రైట్‌ చేసి ఎక్సైజ్‌ శాఖను పూర్తిస్థాయిలో పునరుద్ధరణ చేస్తారని తెలుస్తోంది.

Updated Date - Jun 22 , 2024 | 12:30 AM