Share News

ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయి వసతులు

ABN , Publish Date - Jan 03 , 2024 | 12:14 AM

విద్య ఎంతో విలువైన ఆస్తి అని, అటువంటి విద్యను పేదింటి పిల్లలకు ఉచితంగా అందించాలని పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయి వసతులు కల్పిస్తూ ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యమి స్తోందని హోం మంత్రి తానేటి వనిత అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయి వసతులు

  • హోం మంత్రి వనిత.. విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ

తాళ్లపూడి/కొవ్వూరు/చాగల్లు, జనవరి 2: విద్య ఎంతో విలువైన ఆస్తి అని, అటువంటి విద్యను పేదింటి పిల్లలకు ఉచితంగా అందించాలని పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయి వసతులు కల్పిస్తూ ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యమి స్తోందని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. తాళ్లపూడి మండలం పెద్దేవం, కొవ్వూరు మండలం దొమ్మేరు, చాగల్లు మండలంలోని జడ్పీ హైస్కూళ్లలో 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన ట్యాబ్‌లను మంగళవారం ఆమె పం పిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యారంగంలో వినూత్న సంస్కరణలు తీసుకువచ్చి విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ట్యాబ్‌ల పంపిణీని ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదన్నారు. బైజూస్‌ కంటెంట్‌తో అందించి ట్యాబ్‌లలో లాకింగ్‌ సిస్టం ఉందన్నారు. ఎవరికైనా ఇబ్బం ది కలిగితే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేయాలన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా విద్యారంగంపై ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. కార్యక్రమాల్లో పెద్దేవంలో సర్పంచ్‌ తిగిరిపల్లి వెంకటరావు, ఉపసర్పంచ్‌ తోట రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి సువర్చల, జడ్పీ వైస్‌ చైర్మన్‌ పోసిన శ్రీలేఖ, ఎంపీపీ జొన్నకూటి పోసిరాజు, కొలిశెట్టి నాగే శ్వరరావు, చింతా వెంకటస్వామి పాల్గొనగా దొమ్మేరులో ఎంపీపీ కాకర్ల నారాయుడు, సర్పంచ్‌ తానేటి కుమారి, సొసైటీ అధ్యక్షుడు ముదునూరి సూర్యనారాయణరాజు, అక్షయపాత్ర శ్రీనివాస రవీంద్ర, ఎంపీడీవో కె.సుశీల పాల్గొన్నారు. ఎంఈవో వి.ఖాదర్‌బాబు, హెచ్‌ఎం పి.వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2024 | 12:14 AM