Share News

ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ తప్పనిసరి

ABN , Publish Date - Feb 01 , 2024 | 12:58 AM

ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల అమలులో అధికా రులు తప్పనిసరిగా ప్రొటోకాల్‌ పాటించాలని, సంక్షేమ పథకాలు సక్రమంగా అందజేయాలని ఎంపీపీ జొన్నకూటి పోసిరాజు పేర్కొన్నారు.

 ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ తప్పనిసరి

  • తాళ్లపూడి సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ పోసిరాజు

తాళ్లపూడి, జనవరి 31: ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల అమలులో అధికా రులు తప్పనిసరిగా ప్రొటోకాల్‌ పాటించాలని, సంక్షేమ పథకాలు సక్రమంగా అందజేయాలని ఎంపీపీ జొన్నకూటి పోసిరాజు పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీటీసీ వీరా హరిబాబు మాట్లాడుతూ మండలంలో అధికారులు, నాయకులు ప్రొటోకాల్‌ పాటించడం లేదన్నారు. గ్రామాల్లో దోమలు ప్రబలు తుంటే ప్రభుత్వం ఇచ్చిన ఫాగ్‌ మిషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా పెద్దేవం కార్యదర్శి సువర్చల మాట్లాడుతూ ఫాగింగ్‌ మిషన్లు పనిచేడంలేదని, సర్పంచ్‌ ఆదేశాలు లేకుండా వాటిని బాగు చేయించలేమని బదులిచ్చారు. కొన్ని గ్రామాల్లో పను లు పూర్తయినా నూతన భవనాలు నేటికీ ప్రారంభం కాలేదన్న విషయంపై కూడా చర్చ జరిగింది. మండలంలో నూతనంగా మంజూరైన 235 ఇళ్ల స్థలాల్లో అన్నదేవరపేట గ్రామానికే 80స్థలాలు కేటాయించడం పట్ల వేగేశ్వరపురం సర్పంచ్‌ కొమ్మిరెడ్డి పరశురామారావు అధికారులను ప్రశ్నించారు. కాగా మలకపల్లి నుంచి ప్రక్కిలంక వరకూ రూ.4 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్డు నిర్మిస్తున్నట్టు ఆ శాఖ అధికారులు తెలిపారు. సమావేశంలో ఎంపీడీవో వెంకటరమణ, ఆర్‌.కిషోర్‌, వైస్‌ ఎంపీపీ కోదాటి కనకం, పలు గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 12:58 AM