Share News

గొల్లప్రోలు సొసైటీ చైర్మన్‌ జ్యోతుల రాజీనామా

ABN , Publish Date - Jun 06 , 2024 | 12:25 AM

గొల్లప్రోలు, జూన్‌ 5: గొల్లప్రోలు విశాల సహకార పరపతి సంఘం(సొసైటీ) చైర్‌పర్సన్‌ జ్యోతుల భీముడు తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో వైసీపీ ఓడిపోయి కూటమి ప్రభుత్వం ఏర్పడనున్న నేపథ్యంలో గత ప్రభుత్వం ద్వారా పదవి పొంది జూలై 30వ తేది వరకూ పదవీకాలం ఉన్నప్పటికి తనతో పాటు డైరెక్టర్లు రామిశె

గొల్లప్రోలు సొసైటీ చైర్మన్‌ జ్యోతుల రాజీనామా

గొల్లప్రోలు, జూన్‌ 5: గొల్లప్రోలు విశాల సహకార పరపతి సంఘం(సొసైటీ) చైర్‌పర్సన్‌ జ్యోతుల భీముడు తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో వైసీపీ ఓడిపోయి కూటమి ప్రభుత్వం ఏర్పడనున్న నేపథ్యంలో గత ప్రభుత్వం ద్వారా పదవి పొంది జూలై 30వ తేది వరకూ పదవీకాలం ఉన్నప్పటికి తనతో పాటు డైరెక్టర్లు రామిశెట్టి సత్తిబాబు, యెన్నేటి బాబురావుతో కలిసి తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సహకారశాఖ డిప్యూటీ రిజిస్ట్రార్‌కు తన రాజీనామా లేఖను పంపినట్టు బుధవారం తెలిపారు.

Updated Date - Jun 06 , 2024 | 12:25 AM