Share News

ఏటిగట్లు తనిఖీ చేసి నివేదిక ఇవ్వండి

ABN , Publish Date - Jun 08 , 2024 | 01:04 AM

రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని తుఫాన్‌లు, వరదలు వంటి ప్రకృతి విపత్తులను ఎదు ర్కొనడానికి అధికారులు ముందస్తు కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ డా.కె.మాధవీలత ఆదేశించారు.

ఏటిగట్లు తనిఖీ చేసి నివేదిక ఇవ్వండి

రాజమహేంద్రవరం, జూన్‌7(ఆంధ్రజ్యోతి) : రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని తుఫాన్‌లు, వరదలు వంటి ప్రకృతి విపత్తులను ఎదు ర్కొనడానికి అధికారులు ముందస్తు కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ డా.కె.మాధవీలత ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం సాయంత్రం ఇరిగేషన్‌, అగ్నిమాపక, వ్యవసాయం, మత్స్య శాఖ, గ్రామీణ నీటిపారుదల శాఖ, రోడ్డు భవనాలు, పంచాయతీరాజ్‌, మునిసిపాల్టీలు, విద్యుత్‌, వైద్యఆరోగ్యశాఖ, డివిజన్‌ మండల స్థాయి అధికారులతో వరదలు, భారీ వర్షాల విపత్తులపై సమీక్షించారు. గతంలో గోదావరి నదికి వచ్చిన వరదలను దృష్టిలో ఉంచుకుని గోదావరి పరీ వాహక ప్రాంతపు గట్లను తనిఖీ చేసి నివేదిక అందించాలని ఆదేశిం చారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో మైనర్‌ ఇరిగేషన్‌ పరిధిలోని ఉన్న 530 చెరువులను రెవెన్యూ,ఇరిగేషన్‌ అధికారులు తనిఖీలు చేసి మరమ్మతులు చేయాలన్నారు. వరద ప్రమాదాల నివారణకు ఇసుక బస్తాలు సిద్ధం చేయాలని చెప్పారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నం దున పీహెచ్‌సీల్లో మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. శానిటేషన్‌ నిర్వహణ వ్యవస్థ పట్ల మునిసిపల్‌, పంచాయతీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి రోజూ పరిశుభ్రమైన తాగునీటిని ప్రజలకు అందించాలన్నారు.వ్యవసాయ, ఉద్యాన, మత్స్యశాఖ అధికారులు రైతు లను దృష్టిలో ఉంచుకుని అధిక వర్షాల వల్ల పంటలకు ఏవిధమైన నష్టం సంభవించకుండా ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా పనులు చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా బలహీ నమైన వంతెనలు, కల్వర్టులు, ముందుగానే గుర్తించి వాటికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ పంచాయతీరాజ్‌ అధికారులను ఆదేశిం చారు.మిచౌంగ్‌ తుపాన్‌ కారణంగా కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో బురద కాలువకు 8 గండ్లు పడ్డాయని.. వాటి మరమ్మతుల రూ.25 లక్షలు ఖర్చవుతుందని ఇప్పటికే ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పం పామని ఇరిగేషన్‌ అధికారులు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె స్పందిస్తూ తక్షణం ఆయా పనులు చేపట్టాలని నిధులు మంజూరు చేస్తా మన్నారు.వెంకటనగరం, తొర్రిగడ్డ, చాగల్నాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ మరమ్మతు పనులు చేపట్టి ఆయకట్టుకు సాగునీరందించే విధంగా సిద్ధంగా ఉండాల న్నారు. రాజమహేంద్రవరం నగరంలో లోతట్టు ప్రాంతాలు ముంపు బారిన పండకుండా నగర పాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పారు. ఆవ డ్రైన్‌ సమస్యపై తహశీల్దార్‌, డీపీవో డ్రెయిన్లను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జిల్లా అధి కారి ఎస్‌.మాధవరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారి డి.బాలశంకరరావు, మత్స్య శాఖ జిల్లా అధికారి వి.కృష్ణారావు, డీపీవో డి.రాంబాబు, నగర పాలక సంస్థ ఎస్‌ఈ జి.పాండురంగారావు,అగ్నిమాపక అధికారి ఎం.మార్టిన్‌ లూ థర్‌ కింగ్‌,ఆర్‌అండ్‌బీ ఈఈ మదుసూధనరావు, ఇరిగేషన్‌ ఎస్‌ఈ ఎ.శ్రీని వాసరావు, ఇరిగేషన్‌ ఈఈ ఆర్‌.కాశీవిశ్వేశ్వరరావు, రామకృష్ణ, డీఈ ఈ రమేష్‌బాబు,ఏఈలు ఆర్‌.సునీల్‌బాబు. ఎ.శివ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 08 , 2024 | 01:04 AM