Share News

గోదారి..దూకుడు

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:50 AM

గోదావరి భయ పెడుతోంది.. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరగడంతో గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు ఆం దోళన చెందుతున్నారు. ఏ క్షణాన ఎటువంటి ప్రమా దం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు. గోదావరి భయ పెడుతోంది.. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరగడంతో గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు ఆం దోళన చెందుతున్నారు. ఏ క్షణాన ఎటువంటి ప్రమా దం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు.

గోదారి..దూకుడు
ఉరుకులు..పరుగులు : ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

గోదావరి ఉగ్రరూపం

ఒక్కసారిగా వచ్చి పడిన వరద

అంచనాలకు మించి ప్రవాహం

ధవళేశ్వరం వద్ద నిండుగా గోదారి

రెండో ప్రమాద హెచ్చరిక జారీ

14.50 అడుగులకు నీటిమట్టం

దిగువకు 13.92 లక్షల క్యూసెక్కులు

నీట మునుగుతున్న లంకలు

భయపెడుతున్న ఏటిగట్లు

ఆందోళనలో ప్రజలు

రాజమహేంద్రవరం, జూలై 27 (ఆంధ్రజ్యోతి)/ కొవ్వూరు : గోదావరి భయ పెడుతోంది.. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరగడంతో గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు ఆం దోళన చెందుతున్నారు. ఏ క్షణాన ఎటువంటి ప్రమా దం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు. గట్లను తాకుతూ లంకలను ముంచుతూ గోదావరి వరద ఉగ్ర రూపం దాల్చింది.గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఎగువ ప్రాంతాల్లో వాగులు, ప్రాజెక్టులు, ఉపనదులు పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరికి ఉపనదులు అయిన ప్రాణహిత,ఇంద్రావతి, పెన్‌గంగా, కిన్నెరసాని నదులతో పాటు సీలేరు, శబరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.అదే విధంగా ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి లక్షలాది క్యూసెక్కుల వరద ప్రవాహం భారీగా నదిలోకి వచ్చి చేరుతుంది.దీంతో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 12 గంటలకు నీటిమట్టం 53.90 అడు గులకు చేరింది. ఇప్పుడిప్పుడే తగ్గుముకం పడుతుందని చెబుతున్నారు.దిగువన కొవ్వూరు,రాజమహేంద్రవరంల మధ్య అఖండ గౌతమీ గోదావరికి భారీగా వరద పోటెత్తి మహోగ్రంగా మారింది. ధవళేశ్వ రం బ్యారేజీ వద్ద మధ్యా హ్నం 3 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 12 గంటలకు బ్యా రేజీ వద్ద నీటిమట్టం 14.50 అడుగులకు చేరింది. బ్యారేజీ నుం చి దిగువకు 13,92, 833 క్యూసెక్కులు విడుదల చేస్తున్నా రు. పోలవరం స్పిల్‌వే నుంచి ఆదివారం ఉద యం 8 గంటలకు 12 లక్షల క్యూసెక్కుల వరకూ వరద ప్రవాహం ఉండవచ్చని అధికా రులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే లంకలన్నీ మునిగి పోయాయి.కొవ్వూరు గోష్పాదక్షేత్రాన్ని మరోసారి ముంచెత్తింది. రాజమహేంద్రవరం, కొవ్వూ రులో స్నానఘట్టాలు పూర్తిగా నీటిమునిగాయి. గోదావరి మహోగ్రరూపం దాల్చడంతో నదీ తీరంలో సచివాలయ కార్యదర్శులు, పోలీసు సిబ్బందితో ప్రత్యే క బందోబస్తు ఏర్పాటుచేశారు. నదిలో ఎవ్వరు దిగకుండా చర్యలు చేపట్టారు. విజ్జేశ్వరం నుంచి పోలవరం వరకు ఉన్న ఏటిగట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ఏజీఆర్‌బీ ఏఈ రేవు సునీల్‌బాబు తెలిపారు. నదీ ప్రవాహం ఉధృతంగా ఉన్నందున ఎవరు నదీలో దిగవద్దని, వేటకు వెళ్లరాదని హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.5 లక్షలు ప్రవాహం దాటిన దగ్గరి నుంచి నదిలో ఇసుక తవ్వకాలు నిలుపుదల చేశామన్నారు. నదిలో వడి ఎక్కువగా ఉన్నందున ఇసుక పడవుల నిర్వాహకులు నదిలోకి వెళ్లవద్దని సూచించారు. ఇదిలా ఉండగా లంకల నుంచి ప్రజలు బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపడంలేదు. సీతానగరం మండలం ములకల్లంక నుంచి ప్రజలు బయటకు రావడం లేదు. వారి అవసరాలకు బయటకు వచ్చి తిరిగి మళ్లీ ఊళ్లోకి వెళ్లిపోతున్నారు.వారి రాకపోకలకు అధికారులు రెండు పడ వలు ఏర్పాటు చేశారు. ఇంత ఉధృతంగా ఉన్నా వాళ్లు ఊరు వదిలి రావడం లేదని అధికారులు చెబుతున్నారు. రా జ మహేంద్రవరంలోని లంకలలోని ప్రజలను ఇప్పటికే పునరా వాస కేంద్రాలలకు తరలించారు. మరింతగా వరద పెరుగు తుండడంతో కొవ్వూరు మండలం మద్దూరులంకలోకి నీరు వచ్చే అవకాశం ఉంది. అయినా బయటకు రావడంలేదు.

మునిగిన లంకలు

పెరవలి, జూలై 27 : గోదావరి వరద తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతుండడంతో లంకలు నీట మునుగుతున్నాయి. పెరవలి మండల పరిధిలో కానూరు, ఉసులుమర్రు, కానూరు అగ్రహారం, తీపర్రు, కాకరపర్రు, ముక్కామల, ఖండవల్లి, గ్రామాల పరిధిలో పలువురు రైతులు గోదావరి లంకభూములుపై ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. రెండు రోజులు కిందట గోదావరి తగ్గుముఖం పట్టడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలోనే మళ్లీ గోదావరి పెరుగుతుండడంతో పంట భూములు నీట మునిగి పాడైపోతాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొన్ని పల్లపు లంక భూముల్లోకి నీరు చేరింది. గోదావరి మరింత పెరిగితే మెరక భూముల్లోని తోటలు కూడా మునిగిపోతాయని ఆవేదన చెందుతున్నారు.

1421 కుటుంబాలకు సాయం

వివరాలు వెల్లడించిన కలెక్టర్‌ ప్రశాంతి

జిల్లాలో గోదావరి, ఎర్రకాలువ వరద బాధిత 1421 కుటుం బాలకు పునరావాస పరిహారం కింద నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు. ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, లీటరు పామాయిల్‌, కేజీ ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు వంతున పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో 529 మందికి ఒక్కొక్కరికి రూ. 3 వేల వంతున ఆర్థిక సహాయం చేశామన్నారు. నల్లజర్ల మండ లంలో 40 కుటుంబాలు, రాజమండ్రి అర్బన్‌లో 163 కుటుంబాలు, బిక్కవోలు 5, గోకవరంలో 18, కడియంలో 4, కోరుకొండలో 20, రాజమండ్రి రూరల్‌లో 1,రంగంపేటలో 5, రాజానగ రంలో 9 , సీతానగరంలో 8 కుటుంబాలకు, చాగల్లులో 1, దేవ రపల్లిలో 11, గోపాలపురంలో 13, కొవ్వూరులో 37, నిడదవో లులో 1077 కుటుం బాలకు పంపిణీ చేస్తున్నామన్నారు.ఇప్పటికే కొందరికి పంపిణీ చేసి నట్టు చెప్పారు.రాజమండ్రి డివిజన్‌లో 233 కుటుంబాలు, కొవ్వూరు డివిజన్‌లో 1077 కుటుంబాలు లబ్దిపొందనున్నాయన్నారు.

కొవ్వూరులో 37 కుటుంబాలకు సాయం

కొవ్వూరు, జూలై 27 : వరద బాధితులకు సహాయం అంద జేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. కొవ్వూరు పట్టణంలో వర్షాలకు ముంపునకు గురైన లేఅవుట్‌-3లో 37 మంది లబ్ధిదారులకు నిత్యావసరాలను శనివారం పంపిణీ చేసి మాట్లాడారు. గత వారం రోజులుగా కురుస్తున్న అధిక వర్షాలకు కొవ్వూరు పట్టణంలో జగనన్న లేఅవుట్‌-3 కాలనీ ముంపుబారిన పడింద న్నారు.మోకాళ్లలోతు నీళ్లలో కాలనీవాసులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గత వైసీపీ ప్రభు త్వం ప్రజలు నివసించడానికి వీలులేని పనికిరాని భూములను ఇళ్ళస్థలాలుగా అందించిందన్నారు. ముంపు భూములు కాబట్టే వాడపల్లి, మద్దూరు, సీతంపేట గ్రామాల లబ్ధిదారులు ఇళ్లస్థలాలు తీసుకోవడానికి రాలేదన్నారు. అప్పులుచేసి ఇళ్లు కట్టుకున్నామని ఆనందం లేకుండా ఇబ్బందులు పడుతున్నామని పలువురు వాపో యారు. సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ ఆశుతోష్‌ శ్రీవాత్సవ, ద్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి,కంఠమణి రామకృష్ణారావు, మద్దిపట్ల శివరామకృష్ణ, టి.వి.రామారావు, ఎంపీపీ కాకర్ల నారాయుడు, దా యన రామకృష్ణ, సూరపనేని చిన్ని, డేగల రామ్‌కుమార్‌, పెరుగు పోతురాజు, రెవెన్యూ సిబ్బంది అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

నేడు మంత్రుల పర్యటన

నిడదవోలు, జూలై 27 : నిడదవోలు మండలం వరద బాధిత ప్రాంతాల్లో ఆదివారం నలుగురు రాష్ట్ర మంత్రులు పర్యటించను న్నారు.ఈ మేరకు బాధితులను పరామర్శించి ముంపు బారిన పడిన చేలను పరిశీలిస్తారు.ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం,కాల్దరి, నిడదవోలు మండలం తాళ్లపాలెం, కంసాలిపాలెం గ్రామాల్లో పర్యటిస్తారు. అక్కడ నుంచి అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు వెళ్లి సాయంత్రం 4 గంటలకు తిరిగి రాజమహేంద్రవరం చేరుకుంటారు. 5:30 గంట లకు సీతానగరం మండలంలోని రాపాక గ్రామంలో పర్యటిస్తారు. పర్యటనలో వ్యవసాయశాఖ మంత్రి కింజరావు అచ్చెన్నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కం దుల దుర్గేష్‌, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు, జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి స్థానిక ప్రజాప్రతినిధులు ఉంటారు.

Updated Date - Jul 28 , 2024 | 12:50 AM