ఉధృతంగా గోదావరి
ABN , Publish Date - Jul 28 , 2024 | 01:31 AM
ఎగువ ప్రాంతాల్లో కురుస్తు న్న భారీ వర్షాలకు ధవళేశ్వరం, భద్రాచలంవద్ద రెండో ప్రమా ద హెచ్చరికలు జారీ చేయడంతో గోదావరి నదికి వరద పోటె త్తింది. దీంతో లంకగ్రామాల్లో తిరిగి వరద ప్రవాహం పెరిగింది. గోదావరికి వరద ప్రవాహం తగ్గి పెరుగుతుండడంతో లంక గ్రామాల ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

నీట మునిగిన వాణిజ్య పంటలు
భయం గుప్పెట్లో లంక గ్రామాల ప్రజలు
ముంపు ప్రాంతాలను పరిశీలించిన నాయకులు
మామిడికుదురు, జూలై 27:ఎగువ ప్రాంతాల్లో కురుస్తు న్న భారీ వర్షాలకు ధవళేశ్వరం, భద్రాచలంవద్ద రెండో ప్రమా ద హెచ్చరికలు జారీ చేయడంతో గోదావరి నదికి వరద పోటె త్తింది. దీంతో లంకగ్రామాల్లో తిరిగి వరద ప్రవాహం పెరిగింది. గోదావరికి వరద ప్రవాహం తగ్గి పెరుగుతుండడంతో లంక గ్రామాల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అప్పనపల్లి కాజ్‌వేపై వరద పోటెత్తడంతో రాకపోకలను నిషేధించారు. అప్పనపల్లి, పెదపట్నంలంక, బి.దొడ్డవరం గ్రామాలకు వెళ్లే ప్రజలు మామిడికుదురు నుంచి అప్పనపల్లి ఉచ్చులవారిపేట మీదుగా ఆయా గ్రామాలకు వెళుతున్నారు. ఆ రహదారిపై కూడా వరదనీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందుల మధ్య ప్రయాణిస్తున్నారు. ఉచ్చలవారిపేటలోని చర్చి వద్ద వడి ఎక్కువగా ఉంటుందని స్థానికుల పేర్కొంటున్నారు. ఆయా గ్రామాల్లోని పల్లపు ప్రాంతాల్లో వరదనీరు చేరింది. అప్పనపల్లిలోని ఇందిరమ్మ కాలనీ, మొల్లేటివారిపాలెం, పాశర్లపూడిలోని శ్రీరామపేట, పళ్లవపాలెం తదితర ప్రాంతాల్లో ఇళ్ల చుట్టూ నీరు చేరడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లంక గ్రామాల్లో పండించే కాయగూర పంటలు వరదనీటిలో చిక్కుకుని పనికి రాకుండా పోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పనపల్లి బాలబాలాజీ దర్శనాలను నాలుగు రోజులు నిలిపివేయడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
పెరుగుతున్న వరదనీరు
ముమ్మిడివరం: గోదావరి ఎగువ భాగాన వరద ఉధృతి పెరగడంతో దిగువనున్న ముమ్మిడివరం మండలంలోని లంక గ్రామాల్లో వరదనీరు శనివారం నుంచి స్వల్పంగా పెరుగుతోంది. వివేకానంద వారధి-గురజాపులంక సిమ్మెంటు రోడ్డుపై కూనాలంక, గురజాపులంక వద్ద శుక్రవారం కన్నా శనివారం నాటికి అడుగు మేర నీటిమట్టం పెరిగింది. గురజాపులంక, కూనాలంక, లంకాఫ్‌ఠాణేలంక, లంకాఫ్ గేదెల్లంక, చింతపల్లిలంక, కమిని, సలాదివారిపాలెం తదితర గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు పెరుగుతోంది. దీంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇదిలావుండగా వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు 260 కుటుంబాలకు 25 కిలోల వంతు బియ్యం, కిలో వంతున నూనె, కందిపప్పు, ఉల్లి, బంగాళదుంపలు పంపిణీ చేశారు. లంక గ్రామాల్లో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ ఆధ్వర్యంలో మంచినీటి సరఫరాను యథాతథంగా చేస్తున్నారు. వరద సహాయక ప్రత్యేకాధికారి ఎస్.మధుసూదన్, తహసీల్దార్ బి.శ్రీనునాయక్, వీఆర్వోలు, సర్పంచ్ కొప్పిశెట్టి కృష్ణమూర్తి తదితరులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
కపిలేశ్వరపురం: లంకగ్రామాలైన కేదార్లంక, వీధివారిలంక, నారాయణలంక, పల్లపులంక, అద్దంకివారిలంక గ్రామాల్లోని అరటి, బెండ, వంగ, కంద, బీర, తదితర కూరగాయ పంటలు వరదనీటిలో చిక్కుకున్నాయి. వరద తగ్గుముఖం పట్టిందన్న సమయంలో మరలా వరద ఉధృతి పెరగడంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. తాతపూడి, కపిలేశ్వరపురం, కోరుమిల్లి పుష్కర ఘాట్‌లవద్ద వరద ఉధృతి పెరిగింది. కోరుమిల్లి లంకలో వేసిన పంటలు పూర్తిగా నీటమునగడంతో అవి పనికిరాకుండా పోయాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. లంకగ్రామాల్లో వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు కొనసాగిస్తున్నారు. అధికారులు వరదల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
బడుగువాని లంకకు పొంచి ఉన్న ప్రమాదం
ఆలమూరు: గోదావరి వరదతో ఆలమూరు మండలంలంక గ్రామమైన బడుగువానిలంకకు ప్రమాదం పొంచి ఉంది. భద్రాచలం వద్ద గోదావరి వరదనీరు ఉధృత ంగా ఉండటంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో ఆదివారం ఉదయానికి ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు వరద నీరు బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యారేజ్‌కు దిగువన ఉన్న బడుగువానిలంకకు ఈసారి వరదనీరు వచ్చే అవకాశం ఉండటంతో గ్రామస్తులు భయం గుప్పెట్లో గడుపుతున్నారు. ఆ గ్రామంలో లోతట్టు ప్రాంతాలలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఎగువ నుంచి వరదనీరు అధికంగా విడుదల కావడంతో జొన్నాడ బ్రిడ్జి వద్ద శనివారం సాయంత్రం వరద ఉధృతంగా ప్రవహిస్తోంది.
పుష్కరఘాట్‌లను ముంచెత్తిన వరద
ఆత్రేయపురం: గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. కాటన్ బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. శనివారం సాయంత్రానికి 14 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. కాటన్ బ్యారేజీ 175 గేట్లను ఎత్తి 13.14 లక్షల క్యూసెక్యుల నీటిని దిగువకు విడుదల చేశారు. వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయ పుష్కర ఘాట్లు వరదకు మునిగిపోయాయి. భక్తులు స్నానాలకు వెళ్లకుండా మెస్‌లు ఏర్పాటు చేశారు. లంక భూముల్లోని వివిధ పంటలు పెరిగిన వరదకు కొట్టుకునిపోయాయి. పిచ్చుకలంకకు చెందిన నిర్వాసితులు గుడారాలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు.
యానాం: యానాం గౌతమి గోదావరిలో వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. దీంతో యానాంకు వరద ప్రభా వం ఎక్కువగా ఉండంటతోపాటు యానాం జీఎంసీ బాల యోగి వారధివద్ద వరద ప్రవాహం ఉధతంగా ప్రవహిస్తుంది. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు యానాం పరిపాలనాధికారి మునిస్వామి సమీక్షించడంతో పాటు ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.
నదీకోత నివారణకు చర్యలు: ఎమ్మెల్యే గిడ్డి
అయినవిల్లి: గోదావరి నదీకోత నివారణకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం వరద ముంపు గ్రామాలైన పొట్టిలంక, యలకల్లంక, కొండుకుదురులంక, అయినవిల్లిలంక, ఎదురుబిడియం కాజ్‌వేల వద్ద వరద పరిస్థితిని ఆయన పరిశీలించారు.. నదీకోతకు గురైన గ్రామాల్లో ఆయన పర్యటించారు. వరద పరిస్థితిని సమీక్షించారు. కాజ్‌వే నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. వరద ముంపు బాధితులకు బియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో వరదల ప్రత్యేకాధికారి వి.శివశంకరప్రసాద్, మండల ప్రత్యేకాధికారి జి.సత్యనారాయణ, తహసీల్దార్ ప్రమద్వర, టీడీపీ మండలశాఖ అధ్యక్షుడు చిట్టూరి శ్రీనివాస్, కుడుపూడి బుజ్జి, సలాది పుల్లయ్యనాయుడు, సయ్యపరాజు సత్యనారాయణరాజు, సలాది బుచ్చిరాజు, మేడిద దుర్గాప్రసాద్, కోనే సునీతసుబ్బలక్ష్మి, గుర్రాల రమాదేవి, బొబ్బా ప్రభాత్‌కుమార్, నేదునూరి వీర్రాజు, పోలిశెట్టి రాజేష్, కాకర శ్రీనివాస్, కడలి వెంకటసత్యనారాయణ, మామిళ్లపల్లి తాతయ్యనాయుడు, జంగా డేవిడ్‌రాజు, మద్దాలసుబ్బారావు, తొత్తరమూడి ప్రభాకరరావు, బడుగు భాస్కరజోగేష్ పాల్గొన్నారు.
గోపాయిలంకలో కొట్టుకుపోయిన స్లూయిజ్ తలుపులు
అల్లవరం: అల్లవరం మండలం గోపాయిలంక వద్ద అవుట్‌ఫాల్ స్లూయిజ్ తలుపు కొట్టుకుపోయి డ్రైయిన్‌లోకి వరద ముంపు ఎగదన్నింది. ఇరిగేషన్ హెడ్‌వర్క్స్, డ్రైయిన్స్ అధికారులు పట్టించుకోక అవుట్ ఫాల్‌స్లూయిజ్ తలుపు ఊడిపోయి కౌశిక డ్రైయిన్ వరదముంపు బారిన పడింది. దీంతో అల్లవరం పరిసర గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందజేసిన కలెక్టర్
రాజోలు, జూలై 27: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వరద బాధితులకు ఒక్కోకుటుంబానికి 25 కిలోల బియ్యం, లీటరు వంటనూనె, కిలో చొప్పున ఉల్లిపాయంలు, కందిపప్పు, బంగాళాదుంపలు అందజేశామని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. రాజోలులో నున్నవారిబాడవ ఏటిగట్టు, మేకపాలెం, పల్లిపాలెం ప్రాంతాల ను శనివారం పరిశీలించారు. వరద బాధితులతో ఆయన మాట్లాడారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ గోపాలకృష్ణ, ఈవోపీఆర్డీ జి.భీమారావు, సర్పంచ్ రేవు జ్యోతి, ఇల్లింగి వెంకటరమణ, సెక్రటరీ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.
వరద సహాయక చర్యల్లో అందరూ పాల్గొనాలి: ఎమ్మెల్యే దేవ
అంతర్వేది: సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంక, టేకిశెట్టిపాలెం, సఖినేటిపల్లిలంక వరద ముంపు ప్రాంతాల్లో పడవపై రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శనివారం పర్యటించారు. ఓఎన్జీసీ కాలనీ, బాడిరేవు, కొత్తలంక తదితర వరద ముంపు ప్రాంతాల్లో బాధితులతో మాట్లాడి తాగునీరు, ఆహారం సకాలంలో అందుతున్నాయా అని ఆరా తీశారు. అనంతరం ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వం అందించిన సరుకులను పంపిణీ చేశారు. గుండుబోగుల పెదకాపు, గెడ్డం మహలక్ష్మిప్రసాద్, రావూరి నాగు, మాజీ సర్పంచ్ బర్రే శ్రీను ఏపీవో నాగప్రసాద్, ఏవో నరసింహారావు, డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్, పినిశెట్టి బుజ్జి, గ్రామ వీఆర్వోలు, కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
మలికిపురం: రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ రామరాజులంక, దిండి గ్రామాల్లో వరద ప్రాంతాలను శనివారం పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. రామరాజులంక బాడవలోకి మోటారుసైకిల్‌పై వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. బాడవ రోడ్డు నిర్మించాలని ఎంపీపీ ఎంవీ సత్యవాణి కోరారు. రామరాజులంక, దిండి గ్రామాల్లో వరద బాధితులకు బియ్యం అందజేశారు.
వరద బాధితులకు ఆహారం అందించాలి: గొల్లపల్లి
అంతర్వేది: అప్పనరామునిలంక, సఖినేటిపల్లిపల్లిపాలెం, టేకిశెట్టిపాలెం, లాక్‌పేట తదితర వరద ముంపు ప్రాంతాల్లో మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు పడవపై ప్రయాణించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలను రక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని, వారికి ఇవ్వాల్సిన సాయం తక్షణమే ఇవ్వాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇందుకూరి సుబ్బరాజు, ఈద రవిరెడ్డి, నల్లి ప్రేమానందం, నల్లి మోహన్, జిల్లెళ్ల చిట్టి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
వరద బాధితులకు బియ్యం పంపిణీ
పి.గన్నవరం: గోదావరి వరద ప్రభావిత గ్రామాలైన గంటిపెదపూడి, ఉడిమూడి శివారు నాలుగు గ్రామాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బియ్యాన్ని వరద బాధితులకు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పంపిణీ చేశారు. ఈసంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరదబాధితులను ప్రభుత్వ పరంగా అన్నివిధాల ఆదకుం టామని చెప్పారు. కార్యక్రమం లో ఆర్డీవో జీవీవీ సత్యనారాయణ, ఎంపీపీ గనిశెట్టి నాగలక్ష్మి, తహసీల్దార్ ఎస్‌కె హూ స్సెన్, ఎంపీడీవో సీహెచ్ త్రీశూలఫాని, ఎంపీటీసీ పల్లిమోసే, సర్పంచ్ దంగేటి అన్నవరం, తోలేటి సత్తిబాబు, సాధనాల శ్రీవెంకట సత్యనారాయణ, సంసాని పెద్దిరాజు, వాసంశెట్టి కుమార్, బొరుసు సుబ్బరాజు పాల్గొన్నారు.
మామిడికుదురు: వరద బాధితులకు ప్రభుత్వం అందించే బియ్యాన్ని పాశర్లపూడిలో టీడీపీ నాయకులు శనివారం పంపిణీ చేశారు. ప్రభుత్వం బాధితులను అన్నివిధాలా ఆదుకుంటుందని టీడీపీ మండలశాఖ అధ్యక్షుడు మొల్లేటి శ్రీనివాస్ పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొనుకు ప్రేమజ్యోతి, టీడీపీ నాయకులు మద్దాల కృష్ణమూర్తి, బోనం బాబు, సూదా బాబ్జి, చుట్టుగుళ్ల కిశోర్, మల్లాడి విష్ణు, గంధం భాస్కర్, జనసేన నాయకులు జాలెం శ్రీనివాసరాజా, తుండూరి బుజ్జి పాల్గొన్నారు.
బోడసకుర్రులో..
అల్లవరం: వైనతేయ వరద కారణంగా బోడసకుర్రు పల్లిపాలెంలో ముంపు బారిన పడిన కుటుంబాలకు 25 కేజీల వంతున తహసీల్దారు పి.సునీల్‌కుమార్, ఎంపీడీవో బీఎస్‌ఎస్ కృష్ణమోహన్, సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి శనివారం బియ్యం పంపిణీ చేశా రు. ముంపునకు గురైన కుటుంబాలతో పాటు జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తహసీల్దారు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి ఎస్.దుర్గాశ్రీనివాస్, చింతా బాబ్జి, ఓలేటి పరమేశ్వరరావు, రొక్కాల నాగేశ్వరరావు, ఆర్‌ఐ ఎండీ శ్రీనివాస్, వీఆర్వోలు యు.చిట్టిబాబు, సత్యనారాయణ, ఉల్లీష్, వీర్రాజు, కేవీ రెడ్డి పాల్గొన్నారు.
ముంపు పొలాలను పరిశీలించిన జిల్లా వ్యవసాయాధికారి
అల్లవరం, జూలై 27: అధిక వర్షాల కారణంగా ముంపునకు గురైన అల్లవరం, రెల్లుగడ్డ గ్రామాల్లో వరి పొలాలను జిల్లా వ్యవసాయధికారి బోసుబాబు బృందం శనివారం పరిశీలించింది. ముంపు దిగిన పొలాల్లో ఎకరానికి 20 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ చల్లాలని సూచించారు. రామేశ్వరం మొగ వద్ద ఇసుక మేటలు తొలగించనందున అన్ని మురుగు కాలువల నుంచి ముంపు నీరు దిగుతోందని బోసుబాబు చెప్పారు. మండలంలో 950 ఎకరాలలో వరినాట్లు పూర్తయ్యాయని 250 ఎకరాల్లో వరినారుమడులు, 20 ఎకరాల్లో నాట్లు ముంపునకు గురయ్యాయన్నారు. ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు, ఏడీఏ ఎంఏ షంసి, ఏవో ఎన్వీవీ సత్యనారాయణ, కొనుకు బాపూజీ, ఎంపీటీసీ ఎన్.మౌనిక వరలక్ష్మి, ఎన్.సుబ్బరాజు, పచ్చిమాల ఏడుకొండలు, కుడుపూడి నాగేశ్వరరావు పాల్గొన్నారు.