రేవులు శుభ్రంగా ఉండాలి
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:47 AM
గోదావరి రేవులను వెంటనే శుభ్రం చేసి.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవా లని నగర పాలక సంస్థ అధికారులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశించారు. రేవులు అపరిశు భ్రంగా ఉండడం.. యాత్రికులు, మాలాధారులు ఎక్కువ సంఖ్యలో స్నానమాచరించే పుష్కర ఘాట్ మరీ దారుణంగా తయారు కావడంపై ‘కార్తీకం వస్తేగానీ.. రేవు లను పట్టించుకోరా’ అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ గు రువారం కథనం ప్రచురిం చిన విషయం తెలిసిందే. దీని పై సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పందించారు. ఆకస్మికంగా పుష్కర ఘాట్‌ను పరిశీలించారు.

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
పుష్కరఘాట్ పరిశీలన
ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన
రాజమహేంద్రవరం, అక్టోబరు 24(ఆంధ్రజ్యో తి): గోదావరి రేవులను వెంటనే శుభ్రం చేసి.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవా లని నగర పాలక సంస్థ అధికారులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశించారు. రేవులు అపరిశు భ్రంగా ఉండడం.. యాత్రికులు, మాలాధారులు ఎక్కువ సంఖ్యలో స్నానమాచరించే పుష్కర ఘాట్ మరీ దారుణంగా తయారు కావడంపై ‘కార్తీకం వస్తేగానీ.. రేవు లను పట్టించుకోరా’ అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ గు రువారం కథనం ప్రచురిం చిన విషయం తెలిసిందే. దీని పై సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పందించారు. ఆకస్మికంగా పుష్కర ఘాట్‌ను పరిశీలించారు. భక్తులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. రుడా ఏర్పా టు చేసిన లాకర్లను స్వయంగా తెరిచి చూశారు. సులభ్ కాంప్లెక్స్‌లో రూ.10 వసూలు చేస్తుండ డంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లాకర్లు అందు బాటులోకి తీసుకురావాలని, సులభ్ కాంప్లెక్స్ వద్ద రూ.5 మాత్రమే తీసుకోవాలని, సూచన బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒకవేళ నిబంధన లను ఉల్లంఘించి ఎక్కువ ధర వసూలు చేస్తే వెంటనే ఆ వ్యక్తు లపై చర్యలు తీసుకొని అవసరమైతే మార్పు చేయాలన్నారు. ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అసౌకర్యం కలగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. రేవుల్లో బ్లీచింగ్ చల్లడంతోపాటు డస్ట్‌బిన్లు ఏర్పాటు చేయాలని, రేవులన్నిటినీ పరిశీలించి ఒక యాక్షన్ ప్లాన్‌తో సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలా చూడాలన్నారు. ప్రమాదా లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవా లని చెప్పారు. రేవుల్లో సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చిన ‘ఆంధ్రజ్యోతి’కి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.