Share News

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి

ABN , Publish Date - May 29 , 2024 | 12:52 AM

తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత నందమూరి తారకరామారావుకే దక్కుతుందని, కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని నియోజకవర్గ కూటమి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఎన్టీఆర్‌ 101వ జయంతిని పలుచోట్ల మంగళవారం ఘనంగా నిర్వహించారు. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు నివాళులర్పించారు.

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి
కొవ్వూరులో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న టీడీపీ నాయకులు

  • ఘనంగా టీడీపీ వ్యవస్థాపకుడి జయంతి

  • నివాళులర్పించిన పలువురు నాయకులు

  • పలుచోట్ల సేవా కార్యక్రమాలు

కొవ్వూరు, మే 28: తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత నందమూరి తారకరామారావుకే దక్కుతుందని, కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని నియోజకవర్గ కూటమి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఎన్టీఆర్‌ 101వ జయంతిని పలుచోట్ల మంగళవారం ఘనంగా నిర్వహించారు. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలుచోట్ల సేవా కార్యక్రమాలు చేపట్టారు. కొవ్వూరులోని టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి ద్విసభ్య కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణారావు, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్టీఆర్‌ సినీ రంగంలో రారాజుగా అందరి మన్ననలు పొందారన్నారు. బడుగు బలహీనవర్గాల ప్రజలు కొన్ని రాజకీయపార్టీల చేతిలో నలిగిపోతున్నారని గ్రహించి తెలుగువారి ఆత్మగౌరవం కోసం, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అనే సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. ఆయన ప్రారంభించిన మండల వ్యవస్థ, మహిళలకు ఆస్తిలో సమానహక్కు, ఎన్టీఆర్‌ గృహ నిర్మాణం, రూ.2కే కిలో బియ్యం పథకాలు నేటికి పేర్లు అమలు చేస్తున్నారన్నారు. ఆయన ఆశయ సాధనలో చంద్రబాబు, లోకేశ్‌ ముందుకు సాగుతున్నారన్నారు. అనం తరం కొవ్వూరులోని 7వ వార్డులో కంటమణి రామకృష్ణ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు దాయన రామకృష్ణ, సూరపనేని చిన్ని, పొట్రు శ్రీనివాస్‌, మద్దిపట్ల శివరామకృష్ణ, సూర్యదేవర రంజిత్‌, ఎంపీపీ కార్ల నారాయుడు, అనుపిండి చక్రధరరావు, మద్దిపాటి సత్యనారాయణ, కాకర్ల బ్రహ్మాజి, పాలింపాటి చినబాబు, గెల్లా సురేష్‌, మద్దుల సత్యనారాయణ, పొట్రు మురళీ, జొన్నలగడ్డ శ్రీనివాస్‌, బొబ్బిలి పేర్రాజు, జనసేన నాయకులు డేగల రాము, గంగుమళ్ళ స్వామి, బీజేపీ నాయకులు బీవీ ముత్యాలరావు, పిల్లలమర్రి మురళీకృష్ణ, పిక్కి నాగేంద్ర పాల్గొన్నారు. అలాగే మండలంలోని తోగుమ్మిలో మద్దిపాటి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తోరం నగేష్‌, ఉప్పులూరి చంద్రశేఖర్‌, యు.శ్రీనివాస్‌, యు.రామకృష్ణ, బిక్కిన ఫణీంద్ర పాల్గొన్నారు. పశివేదలలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి సర్పంచ్‌ తుంపల్లి ఆదినారాయణ నివాళులర్పించారు. కార్యక్రమంలో బేతిన నారాయణ, ఎంపీటీసీ కె.బాలకృష్ణ, తుంపల్లి ఆదినారాయణ, ఉండవల్లి రాజగోపాల్‌, గార శ్రీను, మీసాల శ్రీను పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2024 | 12:52 AM