Share News

ఆడబిడ్డల కోసం కూటమి ‘కలలకు రెక్కలు’ పథకం

ABN , Publish Date - Mar 09 , 2024 | 01:45 AM

టీడీపీ, జనసేన కూటమితోనే మహిళల కలలు సాకారమవుతాయని తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి పేర్కొన్నారు. ఆడబిడ్డలు ఆర్థిక ఇబ్బందులకు చదువు మానేయకుండా వారికోసం ప్రత్యేకంగా ‘కలలకు రెక్కలు’ అనే కొత్త పథకానికి కూటమి శ్రీకారం చుట్టిందని వివరించారు.

ఆడబిడ్డల కోసం కూటమి ‘కలలకు రెక్కలు’ పథకం
అమలాపురంలో జిల్లా తెలుగు మహిళల సమావేశంలో మాట్లాడుతున్న అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి

అమలాపురం టౌన్‌, మార్చి8: టీడీపీ, జనసేన కూటమితోనే మహిళల కలలు సాకారమవుతాయని తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి పేర్కొన్నారు. ఆడబిడ్డలు ఆర్థిక ఇబ్బందులకు చదువు మానేయకుండా వారికోసం ప్రత్యేకంగా ‘కలలకు రెక్కలు’ అనే కొత్త పథకానికి కూటమి శ్రీకారం చుట్టిందని వివరించారు. అమలాపురం టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటర్మీడియట్‌ అర్హతతో కలలకు రెక్కలు పథకంలో చేరవచ్చన్నారు. విద్యార్థుల చదువులకు అయ్యే ఖర్చులను బ్యాంకు రుణాల ద్వారా పొందినా దానికి సంబంధించిన వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. 9261292612 నంబరుకు డయల్‌చేసి లింకును పొంది ప్రతీ ఆడబిడ్డ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా తెలుగు మహిళలు కేక్‌ కట్‌చేశారు. కార్యక్రమంలో జిల్లా తెలుగు మహిళలు మాకిరెడ్డి వీఎన్‌ఎస్‌ పూర్ణిమ, వేగిరాజు వెంకటసత్యప్రవీణ, మట్టపర్తి భారతి, పేరూరి విజయలక్ష్మి, గెల్లా మీనాకుమారి, అప్పారి సుశీల, ఆకుల శాంత, యనమదల లక్ష్మి, నిమ్మకాయల పద్మ, కాండ్రేగుల వాణిఅచ్యుతం, గుమ్మడి నాగమణి, లక్కింశెట్టి సూర్యకుమారి, ముత్తాబత్తుల అరుణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2024 | 01:45 AM