Share News

గ్రామాలను అభివృద్ధి చేయాలి

ABN , Publish Date - Jan 11 , 2024 | 12:28 AM

ప్రత్తిపాడు, జనవరి 10: సబ్‌ప్లాన్‌ ఏజెన్సీ గ్రామాల్లో నిర్వహిస్తున్న మైనింగ్‌ కార్యకలాపాలు నేపథ్యంలో ప్రభుత్వానికి వచ్చే మైనింగ్‌ ఆదాయంతో గిరిజన గ్రామాలను అభివృద్ధి చేయాలని పలువురు గిరిజనులు ఎస్టీ కమిషన్‌ సభ్యుడు శంకర్‌నాయక్‌కు విన్నవించారు. మండలంలోని వంతాడ, పొదురుపాక, పాండవు

గ్రామాలను అభివృద్ధి చేయాలి

శంకర్‌ నాయక్‌కు గిరిజనుల విన్నపం

ప్రత్తిపాడు, జనవరి 10: సబ్‌ప్లాన్‌ ఏజెన్సీ గ్రామాల్లో నిర్వహిస్తున్న మైనింగ్‌ కార్యకలాపాలు నేపథ్యంలో ప్రభుత్వానికి వచ్చే మైనింగ్‌ ఆదాయంతో గిరిజన గ్రామాలను అభివృద్ధి చేయాలని పలువురు గిరిజనులు ఎస్టీ కమిషన్‌ సభ్యుడు శంకర్‌నాయక్‌కు విన్నవించారు. మండలంలోని వంతాడ, పొదురుపాక, పాండవులపాలెం గిరిజన గ్రామా ల్లో బుధవారం 2వ రోజు ఆయన పర్యటించారు. గిరిజను లు కులధ్రువీకరణ పత్రాలకు పడుతున్న ఇబ్బందులను నాయక్‌ దృష్టికి తెచ్చారు. అలాగే గిరిజన గ్రామాల్లో రహదారు లు, తాగునీరు, విద్యుత్‌ సౌకర్యాలు, గృహనిర్మాణం, కొండపోడు పట్టాలు వంటి సమస్యలు పరిష్కరించాలని కోరారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై సత్వరం అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. జిల్లా గిరిజన సంక్షేమాధికారిణి ఎ.విజయశాంతి, తహశీల్దార్‌ గోపాలకృష్ణ, ఎంపీడీవో కుమార్‌బాబు, ఎస్‌ఐ ఎం.పవన్‌కుమార్‌, ఎంఈవో వి.రాజబాబు, ఏపీఎం ఇనుగంటి వెంకట్రావు, ఏపీ వో కుమారస్వామి, హౌసింగ్‌ ఏఈ అత్తిలి ప్రసాద్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ జేఈ శ్రీరాం, ఎంఈవో వి.రాజబాబు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 12:28 AM