Share News

గ్యాస్‌.. రూ.100 తగ్గింది!

ABN , Publish Date - Mar 09 , 2024 | 01:47 AM

సాధారణ గృహ వినియోగదారులు వినియోగించే వంట గ్యాస్‌ ధరను రూ.100 తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం డొమెస్టిక్‌ వంట గ్యాస్‌ ధర రూ.933గా ఉంది. రూ.100 తగ్గించడంతో ఈ ధర రూ.833కు చేరుతుంది.

గ్యాస్‌.. రూ.100 తగ్గింది!

అమలాపురం, మార్చి 8: సాధారణ గృహ వినియోగదారులు వినియోగించే వంట గ్యాస్‌ ధరను రూ.100 తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం డొమెస్టిక్‌ వంట గ్యాస్‌ ధర రూ.933గా ఉంది. రూ.100 తగ్గించడంతో ఈ ధర రూ.833కు చేరుతుంది. శనివా రం నుంచి ఇది అమల్లోకి వస్తుందని కేంద్రం చెప్పింది. ఆ మేరకు బిల్లింగ్‌లో మార్పులు జరిగిన ట్టు గ్యాస్‌ ఏజన్సీ వర్గాలు తెలియజేశాయి. అయితే ఇప్పటికే గ్యాస్‌ బుక్‌ చేసుకున్నవారికి మాత్రం ఈ ధరలు వర్తించే అవకాశం లేదు. ప్రస్తుతం గ్యాస్‌ సబ్సిడీ నామమాత్రంగానే ఉంది. గ్యాస్‌ సిలిండర్‌ కేంద్రం ఇప్పుడు రూ.100 తగ్గించినా సబ్సిడీ మాత్రం పెరగలేదు.

Updated Date - Mar 09 , 2024 | 08:32 AM