వనసమారాధనలు ఐక్యతకు చిహ్నాలు
ABN , Publish Date - Nov 25 , 2024 | 12:37 AM
కార్తీక మాసం ముగుస్తున్న నేపథ్యంలో ఆది వా రం పలుచోట్ల వన సమారాధనల సందడి కానవ చ్చింది. కులాలు, సంఘాలు వారీ ఎవరికి వారు వన భోజనాలు, ఆటపాటలతో ఉత్సాహం గా గడిపారు. దివాన్‌చెరువులోని పుష్కరవనం కార్తీక వన సమారాధనలతో కిక్కిరిసిపోయింది.
పర్యాటక శాఖా మంత్రి దుర్గేష్
పలు ప్రాంతాల్లో కార్తీక వనసమారాధనలు
ఆట, పాటలతో సందడి చేసిన మహిళలు, చిన్నారులు
రాజానగరం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): కార్తీక మాసం ముగుస్తున్న నేపథ్యంలో ఆది వా రం పలుచోట్ల వన సమారాధనల సందడి కానవ చ్చింది. కులాలు, సంఘాలు వారీ ఎవరికి వారు వన భోజనాలు, ఆటపాటలతో ఉత్సాహం గా గడిపారు. దివాన్‌చెరువులోని పుష్కరవనం కార్తీక వన సమారాధనలతో కిక్కిరిసిపోయింది. జాతీయ రహదారి వెంబడి కార్లు, మోటారు సైకిళ్లు బారు లు తీరాయి. అలాగే కాపునాడు ఆధ్వర్యంలో ది వాన్‌చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన వన స మారాధనలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నా రు. రాజానగరంలోని ఆచంట సీతారామయ్య సా మిల్లు ప్రాంగణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆర్యవైశ్యులం తా కుటుంబ సమేతంగా విచ్చేశారు. ఈ సంద ర్భంగా ఏర్పాటు చేసిన వివిధ పోటీల్లో మహి ళలు, చిన్నారులు ఆట, పాటలతో సందడి చేశారు. విజేతలకు బహుమతులు అందజేశారు. దీనిలో భాగంగా సంఘ పెద్దలను సత్కరించారు. కార్యక్ర మంలో ఆర్యవైశ్య సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు గ్రంధి నానబ్బులు, మండలాధ్యక్షుడు మండవిల్లి వెంకన్నబాబు, కంకటాల సత్తిపండు, సముద్రాల రాంబాబు, దుర్గపు వసంతకుమార్, దవుళూరి శ్రీను, గిరిబాబు, కంకటాల రామకృష్ణ, కంకటాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.