Share News

గంటిలో వృద్ధురాలి దారుణ హత్య

ABN , Publish Date - Apr 18 , 2024 | 01:20 AM

కుటుంబ కలహాల నేపఽథ్యంలో మండలంలోని గంటిలో శిరిగినీడి గంటాలమ్మ (78) బుధవారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురైందని ఎస్‌ఐ ఎం.అశోక్‌ తెలిపారు.

గంటిలో వృద్ధురాలి దారుణ హత్య

కొత్తపేట, ఏప్రిల్‌ 17: కుటుంబ కలహాల నేపఽథ్యంలో మండలంలోని గంటిలో శిరిగినీడి గంటాలమ్మ (78) బుధవారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురైందని ఎస్‌ఐ ఎం.అశోక్‌ తెలిపారు. వివరాలు ఇలా వున్నాయి.... గంటి గ్రామానికి చెందిన నాగదేవికి 2015 ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వైరా మండలం రేప్పవరానికి చెందిన సాధం రామకృష్ణతో వివాహమైంది. అయితే అప్పటికే అతడికి తన మేనకోడలితో వివాహమైంది. ఒక ఆడపిల్ల సంతానం కలిగి తర్వాత తలెత్తిన విభేదాలతో పెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నారు. నాగదేవిని వివాహం చేసుకున్నాక ఇద్దరు మగపిల్లలు పుట్టారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ నాగదేవిపై అనుమానంతో తరుచూ వేధింపులకు గురి చేసేవాడు. తమ్ముడు నరేష్‌తో అక్రమ సంబ ంధం ఉందని అనుమానం వ్యక్తం చేసేవాడు. ఈ నేపథ్యంలో 2022లో తమ్ముడు నరేష్‌ను గొడ్డలితో నరికి చంపాడు. అప్పటి హత్యపై వైరా పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చిన రామకృష్ణ నాగదేవిని కాపురానికి పంపించాలని పెద్దలతో మా ట్లాడి... వారి నిర్ణయం మేరకు ఆలమూరు మండలం చెముడులంకలో ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు. అక్కడ కూడా భార్యపై అనుమానం వ్యక్తం చేస్తూ గొడవలు పడేవాడు. దీంతో నాగదేవి ఇద్దరు పిల్లలను తీసుకుని అమ్మమ్మ గంటాలమ్మ దగ్గరకు వచ్చేసింది. 2023 ఆక్టోబరు 9న రామకృష్ణ గంటి గ్రామం వచ్చి కాపురానికి పంపించే విషయంలో ఘర్షణ పడి నాగదేవి అమ్మమ్మ గంటాలమ్మను కొట్టి ఇంట్లోని సామగ్రిని కాల్చివేసి చంపేస్తానని బెదిరించడంతో రామకృష్ణపై కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్తపేట పోలీసులు రామకృష్ణను అరెస్టుచేసి జైలుకు పంపారు. దీంతో రామకృష్ణ కక్ష పెంచుకుని బెయిల్‌పై వచ్చిన తర్వాత బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు మంచంపై నిద్రిస్తున్న గంటాలమ్మను కత్తి తో విచక్షణారహితంగా నరకడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. పక్కగదిలో ఉన్న నాగదేవి పిల్లలతో కలిసి బయటకు రాకుండా దాక్కు ంది. ఈ రోజు మీ అమ్మమ్మను చంపేశాను... ఏదో ఒక రోజున నిన్ను కూడా చంపేస్తాంటూ రామకృష్ణ నాగదేవిని బెదిరించి పరారయ్యాడు. దీనిపై నాగదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి మృతదేహాన్ని కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐతోపాటు రావులపాలెం సీఐ రామ్‌కుమార్‌ పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 18 , 2024 | 07:07 AM