Share News

వంతెనల చెంతనే.. ఇసుక తవ్వేశారు..

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:35 AM

వైసీపీ నాయకుల అక్రమ ఇసుక డ్రెజ్జింగ్‌ కారణంగానే గామన్‌ వంతెనకు ముప్పు వాటిల్లిందని కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు.

వంతెనల చెంతనే.. ఇసుక తవ్వేశారు..
గామన్‌ బ్రిడ్జిపై ఆందోళన చేస్తున్న కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, ద్విసభ్య కమిటీ సభ్యులు

మన్‌ బ్రిడ్జి కుంగడానికి వైసీపీ నాయకులే కారణం

నిబంధనలు మీరి.. అక్రమంగా ఇసుక డ్రెడ్జింగ్‌

కొవ్వూరు, మార్చి 26 : వైసీపీ నాయకుల అక్రమ ఇసుక డ్రెజ్జింగ్‌ కారణంగానే గామన్‌ వంతెనకు ముప్పు వాటిల్లిందని కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. ద్విసభ్య కమిటి సభ్యులు కంటమణి రామకృష్ణారావు, జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరిల ఆధ్వర్యంలో మం గళవారం కొవ్వూరు గామన్‌బ్రిడ్జిపై 52వ స్తంభం వద్ద మరమ్మతులకు గురైన స్పాన్‌ను టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పరిశీలించారు. గోదావరిలో అక్రమ డ్రెడ్జింగ్‌కు పాల్పడుతున్న వారిపై ఎన్నికల కమిషన్‌ క్రిమినల్‌ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ నాయకులు అఖండ గోదావరి గర్భాన్ని కొల్లగొట్టి ఇసుకను దోచు కుంటున్నారన్నారు. జగన్‌ పాలనలో ఇసుకను ఆదాయ వనరుగా మాత్రమే చూసుకుంటూ నిబంధనలు గాలికొది లేశారన్నారు. గోదావరి వంతెనలకు 500 మీటర్ల లోపు ఎటువంటి ఇసుక తవ్వకాలు చేపట్టకూడదని నిబంధన లున్నా పట్టించుకోవడం లేదన్నారు.ఈ ఐదేళ్ల పాలనలో వంతెనల చెంత ఇసుక తవ్వకాలు చేపట్టడంతో రోడ్‌ కం రైలు బ్రిడ్జి శిథిలావస్థకు చేరిందన్నారు. ఇప్పుడు గామన్‌ బ్రిడ్జికి ఆ పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందన్నారు. నిబంధ నలకు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ఇసుకను విచ్చలవిడిగా అక్రమ తవ్వకాలు చేపట్టి దోచుకోవడమే కారణ మన్నారు. గోదావరి వంతెనల చెంతనే రాత్రి, పగలు తేడా లేకుండా భారీ యంత్రాలు పెట్టి ఇసుక డ్రెడ్జింగ్‌ చేసి బయట ప్రాంతాలకు ఇసుక తరలించి లక్షల కోట్లు దోచుకున్నారన్నారు.గామన్‌ వంతెన బేరింగ్‌ పోయిందని ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. బేరింగ్‌కు, పిల్లర్లకు సంబంధం ఏమిటన్నారు. నిపుణులను తీసుకువచ్చి గామన్‌ వంతెనను పూర్తిస్తాయిలో పటిష్ట పర్చాలన్నారు. అక్రమంగా ఇసుక డ్రెడ్జింగ్‌ చేసి గామన్‌ వంతెన కుంగి పోవడానికి కారణమైన వారందరిపై చట్టపరమైన చర్య లు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మద్దిపట్ల శివరామకృష్ణ, సూర్యదేవర రంజిత్‌, పొట్ర శ్రీనివాసరావు, వేమగిరి వెంకట్రావు, కాగిత రఘు, యనమదల సుబ్రహ్మణ్యం, బర్ల శ్రీనివాస్‌, కౌన్సిలర్లు బొండాడ సత్యనారాయణ, కండెల్లి రామారావు, కిలారి వెంకటలక్ష్మి, కిలారి రమణ, జాగారపు వీరబాబు, జనసేన నాయకులు డేగల రాము, గంగుమళ్ల స్వామి మారిశెట్టి వెంకటేశ్వరరావు, కొప్పాక విజయకుమార్‌, చిరంజీవి పాల్గొన్నారు.

ఇసుక డ్రెడ్జింగ్‌తో ముప్పు

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 26: ఇసుక డ్రెడ్జింగ్‌ చేయడమే గామన్‌ బ్రిడ్జి కుంగిపోవడానికి కారణమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ అన్నారు. రాజమహేంద్రవరం కంబాలచెరువు వద్ద ఉన్న ఆయన కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. గోదావరిలో అక్రమంగా జరుగుతున్న ఇసుక డ్రెడ్జింగ్‌ కారణం గానే గామన్‌ బ్రిడ్జికి ముప్పువాటిల్లిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం ఇసుక దోపిడీ చేయడం వల్ల పిల్లర్లు కుంగిపోతున్నాయన్నారు. ఇదే పరిస్థితి రోడ్‌ కం రైలు బ్రిడ్జికి దాపురించిందన్నారు. అక్రమ ఇసుక తవ్వకాల వల్ల గోదావరి నదిపై ఉన్న బ్రిడ్జిలు కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. రాజమహేంద్రవరం ప్రజలకు మళ్లీ పాత రోజులు వచ్చేలా ఉన్నాయన్నారు.మా చిన్నతనంలో కొవ్వూరు వెళ్లాలంటే గోదావరి పంటు ఎక్కి కొవ్వూరులో దిగి అక్కడ నుంచి వెళ్లేవారమని.. మళ్లీ ఆ పరిస్థి తులు జగన్‌ దయవల్ల వస్తాయోమో అన్నారు. గామన్‌ బ్రిడ్జి స్తంభం కుంగిపోవడం, ఇసుక తవ్వకాలపై న్యాయస్థానం జోక్యం చేసుకుని సమగ్రవిచారణ జరిపించి దోషులను శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో టీడీపీ నాయకులు జక్కంపూడి అర్జున్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 12:35 AM