Share News

వెంకటాపురంలో ఉచిత వైద్య శిబిరం

ABN , Publish Date - Apr 07 , 2024 | 12:26 AM

గండేపల్లి, ఏప్రిల్‌ 6: సూరంపాలెం ఆదిత్య కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ విద్యార్థులు ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో వెంకటాపురం గ్రామంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వ

వెంకటాపురంలో ఉచిత వైద్య శిబిరం

గండేపల్లి, ఏప్రిల్‌ 6: సూరంపాలెం ఆదిత్య కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ విద్యార్థులు ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో వెంకటాపురం గ్రామంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 200 మంది పేదలకు వైద్య పరీక్షలు నిర్వహించి రూ.10వేలు విలువ గల మందులను ఉచితంగా పంపిణీ చేసినట్టు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.రవిశంకర్‌ తెలిపారు. ద్వారంపూడి శ్రీనివాస్‌, ద్వారంపూడి మణికంఠ చక్రవర్తి, ముంగి గంగాధర్‌, ముంగి రాము, ముంగి ప్రసాద్‌, సలాది స్వామి, బోడెం మణికంఠ, బోడెం వీరేంద్ర, అడబాల శివన్నారాయణ, మువ్వ మణికంఠ, వెంకటాపురం గ్రామ యూత్‌ మెంబర్స్‌, ఎస్‌ఎన్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్స్‌ పి. ప్రశాంతి, రేణుక, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు ఉన్నారు.

ముగిసిన శిక్షణా తరగతులు

ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాల పెట్రోలియం విభాగం నందు ఇండస్ట్రీయా ఆటోమేషన్‌ విత్‌ పీఎల్‌సీ అనే అంశంపై రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఐదురోజుల పాటు నిర్వహించిన శిక్షణా తరగతులు ముగిశాయని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ఏపీఎస్‌డీసీకి చెందిన ఎం.కులదీప్‌కుమార్‌ శిక్షణ అధిపతిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మేడపాటి శ్రీనివాస్‌రెడ్డి, పెట్రోలియం విభాగం అధిపతులు డాక్టర్‌ ఆర్‌.గిరిప్రసాద్‌, కోఆర్డినేటర్స్‌ తదితరులున్నారు.

Updated Date - Apr 07 , 2024 | 12:26 AM