మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:39 AM
తీరప్రాంత మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ముమ్మిడివరం ఎమ్మెల్యే విజేత దాట్ల బుచ్చిబాబు అన్నారు.

ఐ.పోలవరం, జూన్ 16: తీరప్రాంత మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ముమ్మిడివరం ఎమ్మెల్యే విజేత దాట్ల బుచ్చిబాబు అన్నారు. భైరవపాలెం పంచాయతీ తీర్ధాలమొండికి చెందిన మత్స్యకార మహిళలు ఆదివారం మురమళ్ళ క్యాంపు కార్యాలయంలో బుచ్చిబాబును కలిసి అభినందించారు. నాలుగు మండలాల నుంచి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు బుచ్చిబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. తాళ్ళరేవు మండల నాయకులు నోట్‌బుక్స్ అందించి అభి నందించడం విశేషం. కార్యక్రమంలో కుడుపూడి శ్రీమన్నారాయణ, జనసేన నాయకులు ముత్యాల జయలక్ష్మి, గుద్దటి జమ్మి, అత్తిలి బాబూరావు, ధూళిపూడి గోపి పాల్గొన్నారు.