Share News

బాటిల్‌తో చేపల వేట!

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:50 AM

చేపల వేటలో యానాంకు చెందిన మత్స్యకార యువకులు కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తూర్పుగోదావరి జిల్లాలో అంతర్‌ భూభాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన యానాం పర్యాటకంగా ప్రసిద్ధి చెందింది.

బాటిల్‌తో చేపల వేట!

గోదావరిలో భారీగా చిక్కుతున్న చేపలు

వైరల్‌ అవుతున్న వీడియోలు

యానాం, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): చేపల వేటలో యానాంకు చెందిన మత్స్యకార యువకులు కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తూర్పుగోదావరి జిల్లాలో అంతర్‌ భూభాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన యానాం పర్యాటకంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గోదావరి కలిసే సముద్ర ముఖద్వారం కావడంతో అరుదైన మత్య సంపద దొరుకుతుంది. ఈ సంపద యానాం మత్స్యకారులు వేటకు చిక్కడంతో వాటిని మార్కెట్‌ లో విక్రయిస్తుంటారు. ముఖ్యంగా మత్స్యకారు లు చేపల వేటలను వివిధ రకాల వలలు, గేలాల ద్వారా చేస్తుంటారు. అయితే ప్రస్తు తం యానాం మత్స్యకార యువకులు చేపలు పట్టడంతో కొత్త ఒరవడి అనుసరిస్తున్నారు. యానాం కనకాలపేట సమీపంలోని పుష్కర్‌ఘాట్‌ వద్ద గల గోదావరిలో ఎప్పటిలా కా కుండా నూతన నిధానంలో చేపల వేట నిర్వ హించారు. ఒక లీటర్‌ వాటర్‌, డ్రింక్‌ బాటిల్‌ ను సగానికి కట్‌చేసి వాటికి నాలుగు వైపులా తాడుకట్టి వాటిలో మైదా పిండివేసి గోదావరిలోకి విసురుతున్నారు. బాటిల్‌లోని మైదాపిండి తినేందుకు వచ్చిన చేప (కొయ్యింగ మాత్రమే) వాటిలో ఇరుక్కుపోతోంది. వాటిని పైకి లాగుతారు. గత మూడు రోజులుగా ఈ వేట కొనసాగుతోంది. లైవ్‌ఫిష్‌ దొరుకుతున్నాయని ఆనోటా ఈనోట తెలియడంతో సందర్శకుల తాడికి ఎక్కువైంది. కొందరు కొనుగోలు చేసుకుని ఇంటికి పట్టుకెళ్తున్నారు.

Updated Date - Dec 27 , 2024 | 12:50 AM