దేశంలో మొదట ఫలితం రాజమండ్రి రూరల్
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:58 AM
దేశం లోనే మొదటగా రాజమహేంద్రవరం రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థి గోర్లంట బుచ్చయ్యచౌదరి విజయం సాధించినట్టు ప్రకటించిన జేసీ తేజ్ భరత్‌ను కలెక్టర్ డా. కె.మాధవీలత గురువారం అభినందించి మాట్లా డారు.

రాజమహేంద్రవరం, జూన్6(ఆంధ్రజ్యోతి) : దేశం లోనే మొదటగా రాజమహేంద్రవరం రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థి గోర్లంట బుచ్చయ్యచౌదరి విజయం సాధించినట్టు ప్రకటించిన జేసీ తేజ్ భరత్‌ను కలెక్టర్ డా. కె.మాధవీలత గురువారం అభినందించి మాట్లా డారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం ఆమె రిటర్ని ంగ్ అధికారులతో సమీక్షించారు. వాస్తవానికి రౌండ్లను బట్టి రాజమహేంద్రవరం రూరల్ ఫలితం ఆఖరున ప్రకటించాలి కానీ అక్కడి ఆర్వో, జేసీ ఎన్.తేజ్‌భరత్ చొరవ, కౌంటింగ్ అధికారుల సమన్వయంతో మొదటి ఫలితంగా వచ్చిందన్నారు. జిల్లాలోని ఎంపీ స్థానంతో పాటు మిగతా అసెంబ్లీ ఫలితాలు అందరికంటే ముందే ప్రకటించగలిగామన్నారు. రిటర్నింగ్ అఽధికా రులు, నోడల్ అధికారులు, వారి సిబ్బంది, ఎంతో నిబద్ధతతో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేశారన్నారు.మీడియా పోషించిన పాత్ర వల్ల ఎన్నికలు సజావుగా సాగ డానికి ఉపయోగపడిందని చెప్పారు.జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘ టనలు జరగకుండా సమర్థవంతంగా ఎస్పీ పి.జగ దీశ్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించారని ప్రశం సించారు. జేసీ ఎన్.తేజ్‌భరత్, మునిసిపల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్ మాట్లాడుతూ జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ కె.మాధవీలత పటి ష్టమైన ప్రణాళికతో ముందుకు సాగడం వల్లే తామంతా పనిచేయగలిగామన్నారు. సమావేశంలో డీఆర్వో జి.నరసింహులు, సబ్.కలెక్టర్ అశుతోష్‌మిశ్రా, ఆర్డీవో ఎ. చైత్రవర్షిణి, కెఎల్ శివజ్యోతి, ఆర్‌వీ.రమణ నాయక్, ఎం. మాధురి తదితరులు పాల్గొన్నారు.
========================